కొండనాలుకకు మందేస్తే, ఉన్ననాలుక ఊడి పడిందని, బ్రెగ్జిట్ రెఫెరెండంలో ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్ నిర్ణయించుకుంటే, ్రబిటన్పై యూరోపియన్ యూనియన్ లోని 28 సభ్య దేశాలు మరోలా పగతీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.ఇక ముందు ఈయూలో ఇంగ్లీషు భాషను ఉపయోగించడంపై నిషేధం విధించే ందుకు యూరోపియన్ యూనియన్ లోని 27 సభ్య దేశాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బ్రెగ్జిట్ రెఫెరెండం అమలు దిశగా, ్రబిటన్ సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ప్రస్తుత నిర్ణయం జీర్ణించుకోలేనిదే.యూరోపియన్ యూనియన్ లో తమ అధికారిక భాష కాకున్నా, ఇతర దేశాలన్నీ ఆంగ్లభాషకే ప్రాధాన్యత ఇస్తున్న విషయం విదితమే.
కాగా, ఈయూలో ఆంగ్ల భాష ప్రధానంగా ఉపయోగిస్తుంటామనీ, అయితే బ్రిటన్ ఈయూలో లేనప్పుడు ఇంగ్లీషు భాష కూడా మాకు అవసరం లేదనీ ఈయూ పార్లమెంట్లో ఈ విషయమై చర్చ జరిగిందని పోలెండ్ కు చెందిన యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యుడు డరెట హెబ్నర్ పాత్రికేయుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.