రష్మీతో డేటింగ్ చేయాలంటే, ఆ పని చేస్తే సరిపోతుందట

ఏదో సినిమాలో, ఏదో ఫ్రేమ్ లో, ఏదో మూల, ఏదో అలా కనబడే పాత్రల నుంచి తన కెరీర్ మొదలుపెట్టింది రష్మీ.అది కూడా టీనేజ్ లో.

 Watch Her Movie 5000 Times And Date Anchor Rashmi-TeluguStop.com

సినిమా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీ కి వస్తే కనీసం క్యారక్టర్ ఆర్టిస్టుగా అయినా గుర్తింపు రాలేదు.టైమ్ పడితే పట్టింది కాని, జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో రష్మీ దశాదిశా మారిపోయాయి.

రాత్రికి రాత్రే స్టార్ యాంకర్ గా ఎదిగిన రష్మీ గౌతమ్ ఆ తరువాత సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టింది కాని, సినిమాల్లో పునరాగమనం కూడా మిశ్రమ ఫలితాల్నే రుచి చూసింది

కొంత గ్యాప్ తరువాత రష్మీ నటించిన సినిమా నెక్స్ట్ నువ్వే.ఈటివి ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది.

ఇక రష్మీ అప్పుడే ఆ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన డేట్ చేయాలనుకుంటున్న అబ్బాయిలో ఎలాంటి క్వాలిటి కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా తన సినిమాని (నెక్స్ట్ నువ్వే) 5000 సార్లు చూస్తే సరిపోతుంది, తాను డేటింగ్ కి రెడీ అనేసింది

రష్మీ ఇలా అనేసిందో లేదో, అల్రెడి ట్విట్టర్ లో కుర్రాళ్ళు 5000 టికెట్లకి ఎంత ఖర్చు అవుతుంది అంటూ లెక్కలు వేయడం మొదలుపెట్టింది.

వారి చేష్టలకు రష్మీ తెగ మురిసిపోతోంది.మరి రష్మీ మొదలుట్టిన ఈ వింత ప్రమోషన్ ఈ సినిమాకి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube