స్మార్ట్ తొలి జాబితాలో వరంగల్

‘ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ సిటీ పోటీలో తెలంగాణ నుంచి వరంగల్ స్తానం ద‌క్కించుకుంది.మంగ‌ళ‌వారం కేం్ర‌ద‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించిన 13 విజేత నగరాల జాబితాలో అగ్రస్థానంలో ల‌క్నో త‌రువాత వ‌రంగ‌ల్ ఉండ‌టం విశేషంగా చెప్పాలి

 Warangal Stands Second In Fast Track Competition-TeluguStop.com

ఫాస్ట్ ట్రాక్ పోటీ లో 23 నగరాలలో లక్నో, న్యూ టౌన్ కోలకతా, పనాజి, ఘాట్ (అరుణాచల్ ప్రదేశ్), ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్), ఫరీదాబాద్ (హర్యానా), రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), భాగల్పూర్ (బీహార్), షిల్లాంగ్ (మేఘాలయ), నామ్చి (సిక్కిం), పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ & నికోబార్ దీవులు), డయ్యూ (డామన్ & డయ్యూ), Oulgaret (పుదుచ్చేరి), సిల్వాస్సా (దాద్రా & నగర్ హవేలి), ఇంఫాల్ (మణిపూర్), రాంచి (జార్ఖండ్), అగర్తల (త్రిపుర), కొహిమ (నాగాలాండ్), ఐజ్వాల్ (మిజోరాం), కవరత్తిలో (లక్షద్వీప్), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), చండీగఢ్.

వరంగల్ (తెలంగాణ) ఉన్నాయి;

గత ఏడాది దేశ వ్యాప్తంగా ఈ పోటీ కోసం 97 నగరాలను ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.పౌరుల‌కు అందుతున్న‌ సేవల ఆధారంగా ట్రాక్ రికార్డు నిర్ణయించి, ఆమేర‌కు ఉత్తీర్ణ‌త సాధించిన న‌గ‌రాల‌ను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేసారు.

ఇలా స్మార్ట్ నగరంగా ఎంపిక‌ అయిన ప్రతి న‌గ‌రానికి మొదటి సంవత్సరం రూ 200 కోట్లు.ఆపై ప్రతి ఏడాది 100 కోట్లు చొప్పున మూడు ఆర్థిక సంవత్సరాలలో కేంద్ర సాయాన్ని అందుతుంది దీనికి జ‌త‌గా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంతే మొత్తంలో నిధులు అందించాల్సి ఉండ‌టంతో ఆ న‌గ‌రాలు శ‌ర‌వేగంగా అభివృద్ధి ప‌థంలో న‌డిచే అవకాశం క‌లుగుతుంద‌న్న‌దే స్మార్ట్ సిటీ లక్ష్యం.

వరంగల్ స్మార్ట్ సిటీ గా తొలి జాబితా లో స్థానం దక్కించు కోవటం పట్ల వరంగల్ మున్సిపల్ కార్పో రేషన్ మేయర్ నన్నపనేని నరేందర్ హర్షం వ్యక్తం చేసారు.స్మార్ట్ నగరాలకందే నిధులతో మరింత ఆకర్షణీయ పట్టణంగా తీర్చి దిద్దుతామని మీడియాకు తెలిపారాయన.

మిషన్ మార్గదర్శకాల మేరకు 2015-16 సమయంలో 20 స్మార్ట్ నగరాలు ఎంపిక కాగా, రెండో దశలో మరి 20 నగరాలను ఎంపిక చేయనున్నారు.ఆపై 2016-17 ఆర్థిక సంవత్సరంలోమరో 40 న‌గ‌రాల‌ను ఎంపిక చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube