కేసీఆర్‌, మోడీ క్రెడిట్ గేమ్ వార్‌..!

ఉమ్మ‌డి ఏపీలో ఎస్సీ రిజ‌ర్వేష‌న్ అంశం పెద్ద హాట్ టాపిక్‌.అధికారంలో ఉన్న‌వాళ్ల‌కి ఈ అంశం పెద్ద స‌వాలు కూడా.

 War Between Pm Modi And Cm Kcr-TeluguStop.com

దీనిపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు కూడా జ‌రిగాయి.జ‌రుగుతున్నాయి.

అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు నేత‌లు హామీలివ్వ‌డ‌మే కానీ.ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చిన వాళ్లు లేరు.

ఇక‌, ఇప్పుడు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎస్సీ రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌మీద‌కి తెచ్చారు.దీనికి త‌మ ప్ర‌భుత్వ సానుకూల‌మేన‌ని ఆయ‌న గ్రీన్ సిగ్న‌ళ్లు పంపారు.

అయితే, అదేస‌మ‌యంలో కేంద్రంతో ముడిప‌డిన వ్య‌వ‌హారం కాబ‌ట్టి ఆయ‌న కేంద్రంతోనూ సంప్ర‌దించేందుకు రెడీ అయ్యారు.

దీనికిగాను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అప్పాయింట్‌మెంట్ కోరారు.

దీంతో అస‌లు క‌థ ఇక్క‌డే మొద‌లైంది.కేసీఆర్‌కి అప్పాయింట్‌మెంట్ ఇచ్చేందుకు మోడీ స‌సేమిరా అన్నారు.

దీంతో ఎస్సీ రిజ‌ర్వేష‌న్ అంశంపై మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీసింది.ఈ అప్పాయింట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాని మోడీ ఉద్దేశ పూర్వ‌కంగానే వెన‌క్కి త‌గ్గుతున్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింది.

ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.తాము తెలంగాణ‌కి ఏం చేసినా.

ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలోకే వెళ్లిపోతోంద‌ని కేంద్రంలోఅని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇప్ప‌టికే అనేక విధాల ఆర్థిక సాయం చేశామ‌ని, కేసీఆర్ చేస్తున్న‌దంతా కేంద్రం ఇస్తున్న సొమ్ముతోనేని గ‌త ఏడాది ఎల్బీ స్టేడియంలో జ‌రిగిన స‌భ‌లో బీజేపీ సార‌ధి అమిత్ షా స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎస్సీ రిజ‌ర్వేష‌న్‌పై కూడా తాము స‌హ‌క‌రిస్తే.రానున్న ఎన్నిక‌ల్లో ఈ క్రెడిట్‌ను కేసీఆర్ త‌న ఖాతాలో వేసుకుని ల‌బ్ధి పొందే ఛాన్స్ ఉంద‌ని భావించిన క‌మ‌ల నాథులు మోడీ అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త వ‌హించార‌నే టాక్ వినిపిస్తోంది.

దీనికి యూపీ ఎన్నిక‌ల‌ను వాళ్లు సాకుగా చూపుతున్నారు.ఇలా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై అటు మోడీ, ఇటు కేసీఆర్‌లు క్రెడిట్ గేమ్ ఆడేస్తున్నార‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube