మంత్రి నారాయ‌ణ‌తో డైరెక్ట్ ఫైట్‌..!

నెల్లూరు మునిసిప‌ల్ పాల‌న‌లో రాజ‌కీయాలు పెరిగిపోయాయి.మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్, ఇదే జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణల మ‌ధ్య ఆధిప‌త్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.

 War Between Mayor Azeez And Minister Narayana-TeluguStop.com

దీనికి కేవ‌లం మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ బ‌దిలీ వ్య‌వ‌హార‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది.వాస్త‌వానికి నెల్లూరు త‌న సొంత జిల్లా కావ‌డంతో నారాయ‌ణ స‌హ‌జంగానే జిల్లా పాలిటిక్స్‌పై పైచేయి సాధించాల‌ని చూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈయ‌న ఇటీవ‌ల మునిసిప‌ల్ వ్య‌వ‌హారాల‌ను కూడా పూర్తిగా త‌న అదుపులోకి తెచ్చుకోవాల‌ని భావించారు.

ఈ క్ర‌మంలోనే నెల్లూరు కార్పొరేష‌న్ వ్య‌వ‌హారాలు, అభివృద్ధి ప‌నుల‌ను సీఎం చంద్ర‌బాబు స‌హా తాను ఆశించిన విధంగా జ‌ర‌గ‌డం లేద‌ని మంత్రి నారాయ‌ణ భావించారు.

దీనికి కొర్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ వెంక‌టేశ్వ‌రులే కార‌ణ‌మ‌ని, ఆయ‌న‌ను త‌ప్పిస్తేనే నెల్లూరు మునిసిప‌ల్ పాల‌న గాడిలో ప‌డుతుంద‌ని మంత్రి భావించ‌డ‌మే కాకుండా ఈ క్ర‌మంలో బ‌దిలీ ఉత్త‌ర్వులు ఇప్పించేశారు.ఇప్పుడు ఈ ప‌రిణామ‌మే సొంత జిల్లాలో నారాయ‌ణ‌తో ఫైటింగ్ పెట్టుకునే ప‌రిస్థితి తెచ్చింది.

వాస్త‌వానికి కార్పొరేష‌న్‌కి సంబంధించి ఏదైనా చ‌ర్య‌లు తీసుకునే ముందు సంబంధిత కార్పొరేష‌న్ మేయ‌ర్‌కి మాట మాత్రంగానైనా చెప్పాలి.

అయితే, మంత్రి నారాయ‌ణ క‌మిష‌న‌ర్ బ‌దిలీ విష‌యంలో మేయ‌ర్ అజీజ్(ఈయ‌న కూడా టీడీపీ నేతే.

అంతేకాదు, వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ చేసేందుకు మంత్రి నారాయ‌ణే స‌హ‌క‌రించారు కూడా! ఆయ‌న‌కి ఒక్క‌మాట కూడా చెప్ప‌కుండా ప‌నికానిచ్చేశారు.దీంతో అజీజ్ మంత్రిపై తీవ్ర‌స్థాయిలో ఫైరైపోతున్నారు.

మేయ‌ర్‌గా ఉన్న త‌న‌కు ఒక్క‌మాట కూడా చెప్ప‌క‌పోవ‌డాన్ని అజీజ్ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు.

రొట్టెల పండగ సందర్భంగా చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ టెండర్లకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం కొంత కాలంపాటు కమిషనర్‌ కొనసాగాల్సిందేనని మేయ‌ర్ అంటున్నారు.

ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కైనా తేల్చుకునేందుకు తాను సిద్ధ‌మేన‌ని అజీజ్ త‌న స‌న్నిహితుల‌తో అన్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో కమిషనర్‌ బదిలీని ఎలాగైనా ఆపేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ద్వారా మేయర్‌ అజీజ్ ఒత్తిడి తెస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌రోప‌క్క‌, నేరుగా సీఎం చంద్ర‌బాబుకే రైట్‌గా హ్యాండ్‌గా ఉన్న మంత్రి నారాయ‌ణ ఈ విష‌యంలో ఏం చేస్తారో చూడాలి.మొత్తానికి అజీజ్ మాత్రం మంత్రి నారాయ‌ణ‌తో ఫైటింగ్‌కి రెడీ అవుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube