కొండా దంప‌తులు వ‌ర్సెస్ క‌డియం

వ‌రంగ‌ల్ రాజ‌కీయాలు టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వానికి కంట్లో న‌లుసులా మారాయా? డిప్యూటీ సీఎం క‌డియం, కొండా దంప‌తుల మ‌ధ్య పోరు ప‌రాకాష్ట‌కు చేరిందా? ఆధిప‌త్య పోరును ఆపేందుకు టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వానికి కూడా సాధ్యం కావడం లేదా? అంటే ఔన‌నే అంటున్నాయి టీఆర్ ఎస్ వ‌ర్గాలు.జిల్లాలో టీఆర్ ఎస్ బ‌లం పుంజుకునేందుకు ఇటు టీడీపీ, అటు వైసీపీల నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు కేసీఆర్‌.

 War Between Kadiyam And Konda Couple-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే టీ డీపీ నుంచి క‌డియం ముందుగా కారెక్కారు.

దీంతో ఆయ‌న‌ను డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌రించింది.

ఇక‌, ఆ త‌ర్వాత వ‌రుస‌లో కొండా దంప‌తులు కూడా కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ ఎస్‌లో చేరారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.

ఈ నేత‌లు వరంగ‌ల్‌కి చెంద‌డంతో.ఎవ‌రికి వారు త‌మ త‌మ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించేందుకు వెనుకాడ‌డం లేదు.

డిప్యూటీ సీఎం అయిన క‌డియం జిల్లాలో త‌న మాటే నెగ్గాల‌ని భావిస్తుంటే.కొండా దంప‌తులు మాత్రం గ‌త కొన్నేళ్లుగా వరుస‌గా ప్ర‌జ‌లు త‌మ‌తోనే ఉన్నార‌ని, కాబ‌ట్టి త‌మ‌మాటే నెగ్గాల‌ని భావిస్తున్నారు.

దీనికితోడు రేపోమాపో కొండా సురేఖ‌కి కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.ఇది మ‌రింత‌గా గొడ‌వ‌ల‌కు ఆజ్యం పోస్తోంది.

తెలంగాణ మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌కు చోటు లేక‌పోవ‌టం కూడా ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారింది.అందుకే.

చివ‌ర్లో అయినా.మ‌హిళ‌గా సురేఖ‌కు కేబినెట్‌లో అవ‌కాశం ఇవ్వాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌ట‌.

దీంతో.సురేఖ మంత్రి గాక‌ముందే జిల్లాలో చ‌క్రం తిప్పుతుందంటూ.

మిగిలిన గ్రూపులు పార్టీప‌ట్ల విముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం.ఇది కాస్తా.

కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగా మార‌టంతో.స‌యోధ్య కుదర్చ‌మంటూ.

ఆర్ధిక‌మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు పుర‌మాయించార‌ట‌.

అయితే.

ఆయ‌న కూడా కొద్దిరోజులు జిల్లాలో ప‌ర్య‌టించి.అమ్మో వారి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌టం నా వ‌ల్ల కాదంటూ.

సీఎం ఎదుట వాపోయార‌ట‌.దీంతో ఇప్పుడు దీనిపై కేసీఆర్ తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.

ఏదో ఒక‌టి చేసి జిల్లాలో పొలిటిక‌ల్ వార్‌కి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ఆయ‌న భావిస్తున్నాడ‌ట‌.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube