Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

కొండా దంప‌తులు వ‌ర్సెస్ క‌డియం-War Between Kadiyam And Konda Couple

Telugu News

వ‌రంగ‌ల్ రాజ‌కీయాలు టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వానికి కంట్లో న‌లుసులా మారాయా? డిప్యూటీ సీఎం క‌డియం, కొండా దంప‌తుల మ‌ధ్య పోరు ప‌రాకాష్ట‌కు చేరిందా? ఆధిప‌త్య పోరును ఆపేందుకు టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వానికి కూడా సాధ్యం కావడం లేదా? అంటే ఔన‌నే అంటున్నాయి టీఆర్ ఎస్ వ‌ర్గాలు. జిల్లాలో టీఆర్ ఎస్ బ‌లం పుంజుకునేందుకు ఇటు టీడీపీ, అటు వైసీపీల నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు కేసీఆర్‌. ఈ క్ర‌మంలోనే టీ డీపీ నుంచి క‌డియం ముందుగా కారెక్కారు.

దీంతో ఆయ‌న‌ను డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌రించింది. ఇక‌, ఆ త‌ర్వాత వ‌రుస‌లో కొండా దంప‌తులు కూడా కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ ఎస్‌లో చేరారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ నేత‌లు వరంగ‌ల్‌కి చెంద‌డంతో.. ఎవ‌రికి వారు త‌మ త‌మ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించేందుకు వెనుకాడ‌డం లేదు. డిప్యూటీ సీఎం అయిన క‌డియం జిల్లాలో త‌న మాటే నెగ్గాల‌ని భావిస్తుంటే.. కొండా దంప‌తులు మాత్రం గ‌త కొన్నేళ్లుగా వరుస‌గా ప్ర‌జ‌లు త‌మ‌తోనే ఉన్నార‌ని, కాబ‌ట్టి త‌మ‌మాటే నెగ్గాల‌ని భావిస్తున్నారు.

దీనికితోడు రేపోమాపో కొండా సురేఖ‌కి కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇది మ‌రింత‌గా గొడ‌వ‌ల‌కు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌కు చోటు లేక‌పోవ‌టం కూడా ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారింది. అందుకే.. చివ‌ర్లో అయినా.. మ‌హిళ‌గా సురేఖ‌కు కేబినెట్‌లో అవ‌కాశం ఇవ్వాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌ట‌. దీంతో.. సురేఖ మంత్రి గాక‌ముందే జిల్లాలో చ‌క్రం తిప్పుతుందంటూ.. మిగిలిన గ్రూపులు పార్టీప‌ట్ల విముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇది కాస్తా.. కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగా మార‌టంతో.. స‌యోధ్య కుదర్చ‌మంటూ.. ఆర్ధిక‌మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు పుర‌మాయించార‌ట‌.

అయితే.. ఆయ‌న కూడా కొద్దిరోజులు జిల్లాలో ప‌ర్య‌టించి.. అమ్మో వారి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌టం నా వ‌ల్ల కాదంటూ.. సీఎం ఎదుట వాపోయార‌ట‌. దీంతో ఇప్పుడు దీనిపై కేసీఆర్ తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఏదో ఒక‌టి చేసి జిల్లాలో పొలిటిక‌ల్ వార్‌కి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ఆయ‌న భావిస్తున్నాడ‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Continue Reading
English Summary:Warangal politics became particulates tiar S adhinayakatvaniki eye? Kadiyam deputy chief of the hill and reached a climax fight between the couple? Or being able to stop a campaign dominated adhinayakatvaniki tiar S? Ayes is tiar S sources said. The strength of the US push tiar and the TDP, encouraged immigration from the KCR vaisipila.This pre-order tea Kadiyam karekkaru from DP.

He has gone to the post of deputy chief.However, the presence of the KCR tiar eslo also joined in the Konda couple. Okay so far.. As the leaders varangalki.. Venukadadam whom they do not demonstrate their superiority.Kadiyam district deputy chief, who feel that a victory over his matey ..Konda couple of people in the past few years behind them, so that the expected victory over tamamate.

In addition, getting the news of the hull repomapo minister Konda surekhaki KCR is Sal.Fueled by further clash. The lack of women in the cabinet, the opposition Congress has become a resort.So ..

Deputy Cm,kadiyam,Konda Couple,Konda Surekha,political War,Telangana Cabinet,trs,War Between Kadiyam And Konda Couple,warangal

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

 • News

  TDP MLA Jump to BJP

  By

  తెలంగాణ‌లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు ఎంత తీసిక‌ట్టుగా త‌యార‌వుతుందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున గెలిచిన 15...

 • News

  Why Curd (Dahi) Is A Must-Have During Summer

  By

  పెరుగు అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మంచి రుచిగా ఉండే గడ్డ పెరుగును చాలా మంది ఇష్టపడతారు....

 • Devotional

  why lord krishna wears peacock feather on his head

  By

  శ్రీ కృష్ణుని జగన్మోహన రూపానికి ముగ్ధులు అవ్వని వారు ఎవరు ఉండరు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన వారికి ఆయన తలపై...

 • News

  Tdp Leaders Fight For Amaravati Assembly Seat

  By

  ఏపీ, తెలంగాణ‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యాన్ని కేంద్రం నాన్చుతుండ‌గానే ఆశావాహులు మాత్రం గంపెడాశ‌ల‌తో త‌మ‌కు సీటు రాక‌పోతుందా ? అసెంబ్లీలో అడుగుపెట్ట‌క‌పోతామా...

To Top