కొత్త వార్‌: చ‌ంద్ర‌బాబు వ‌ర్సెస్ బీజేపీ

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ఇత‌ర రాష్ట్రాల‌పై ఎలా ఉంటుందో తెలీదుగానీ…రెండు తెలుగు రాష్ట్రాల‌పై బాగానే ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.ఈ ప్ర‌భావం తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ మీద పెద్ద‌గా ఉండ‌దు.

 War Between Bjp And Chandrababu-TeluguStop.com

మ‌హా అయితే అక్క‌డ విప‌క్ష కాంగ్రెస్ ప్లేస్‌లోకి బీజేపీ వ‌స్తుందేమో.అంత‌కు మించి అక్క‌డ చెప్పుకోద‌గ్గ మార్పులేమి ఉండ‌వు.

ఇక ఏపీలో అధికార టీడీపీకి మిత్ర‌పక్షంగా ఉన్న బీజేపీ ఇక్క‌డ మాత్రం టీడీపీకి షాక్ ఇచ్చేలా బ‌లం పుంజుకునేందుకు తెర‌వెనక ఎన్నో ఎత్తులు వేస్తోంది.

చంద్ర‌బాబు వెంకయ్య‌, హ‌రిబాబు లాంటి వాళ్ల‌ను ఎంత కంట్రోల్ చేస్తున్నా బీజేపీ వీళ్ల‌ను న‌మ్మ‌కుండా త‌న గేమ్ ప్లాన్ తాను అమ‌లు చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు బీజేపీతో కొన‌సాగించిన స్నేహాన్ని ఇప్పుడు మ‌రింత స్ట్రాంగ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి చంద్ర‌బాబు అవ‌స‌రం కంటే…చంద్ర‌బాబుకే బీజేపీ అవ‌స‌రం ఎక్కువ‌….

అయితే చంద్ర‌బాబు మాత్రం చాలా తెలివిగా బీజేపీకి త‌న అవ‌స‌ర‌మే ఎక్కువ అన్న‌ట్టు న‌మ్మించారు.అయితే ఫ‌లితాలు వ‌చ్చాక చంద్ర‌బాబుతో బీజేపీకి ప‌నిలేకుండా పోయింది.

ఇక యూపీలో భాజ‌పా గెల‌వ‌క‌పోయి ఉంటే చంద్ర‌బాబు ధోర‌ణి మ‌రోలా మారేదేమో.! ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల రిజ‌ల్ట్ త‌ర్వాత ఏపీ, తెలంగాణ‌లో సైతం బీజేపీ బ‌లం పెంచుకునేందుకు ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దులుకునేలా క‌నిపించ‌డం లేదు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు మ‌రిన్ని ఎక్కువ సీట్లు కావాల‌ని చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిడి తెచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.ఇక ఇటీవ‌ల వీలున్న‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబును పొగిడే వెంక‌య్య ఇప్పుడు ఆ స్వ‌రం కాస్త త‌గ్గించేశారు.

ఇటీవ‌ల ఏపీలో అసెంబ్లీ భ‌వ‌నం ప్రారంభోత్స‌వం వంటి కీల‌క కార్య‌క్ర‌మానికి ఆయ‌న రాలేదు.ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల రిజ‌ల్ట్ త‌ర్వాత ఏపీలో చంద్ర‌బాబును డీల్ చేసే విధానంలో బీజేపీలో మార్పు వ‌చ్చింద‌న్న రాజ‌కీయ చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఇక్క‌డ చంద్ర‌బాబును టార్గెట్ చేసే బీజేపీ నాయ‌కుల‌కు కూడా కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం మంచి ఫుసింగ్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.

ఫ్యూచ‌ర్‌లో ఏ ప్రాంతీయ పార్టీ మీద ఆధార‌ప‌డ‌కూడ‌ద‌న్న‌ది బీజేపీ ప్లాన్‌.

మ‌రి ఏపీలో ఈ టైంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుంద‌న్న‌ది మాత్రం రాజకీయంగా పెద్ద చ‌ర్చనీయాంశంగానే ఉంది.ఏదేమైనా ఇక‌పై ఏపీలో బీజేపీ దూకుడు పెంచ‌డం…అది చంద్ర‌బాబు వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య ఇన్‌డైరెక్టు ఫైట్‌కు తెర‌లేప‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube