మోక్షజ్ఞకు దర్శకుడు ఫిక్స్‌

నందమూరి ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో మోక్షజ్ఞ.బాలకృష్ణ తనయుడు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.2015లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గతంలో బాలయ్య ఒకానొక సమయంలో ప్రకటించాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.

 Vv Vinayak To Direct Mokshagna-TeluguStop.com

విదేశాల్లో డాన్స్‌, యాక్షన్‌ సన్నివేశాల కోసం కఠిన శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇక బాలయ్య సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఉంటుందని సమాచారం.

మోక్షజ్ఞ మొదటి సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశాలున్నాయంటూ ఆమద్య మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను బోయపాటి కొట్టి పారేశాడు.

ఇక మోక్షజ్ఞ కోసం నిర్మాత సాయి కొర్రపాటి ‘రానే వచ్చాడయ్య రామయ్య’ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు.బాలయ్య వద్ద సానిహిత్యం ఉన్న సాయి కొర్రపాటి నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మాణం అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.

ఇక మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకుడిగా వినాయక్‌ పేరును బాలయ్య పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు మంచి ఓపెనింగ్‌ను ఇచ్చిన వినాయక్‌ ప్రస్తుతం అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా సక్సెస్‌ అయితే మరో ఆలోచన లేకుండా మోక్షజ్ఞను వినాయక్‌ చేతిలో పెట్టే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube