వొడాఫోన్ సిమ్ ఉంటే పండగ చేస్కోండి-Vodafone Offers 3 Months Free Subscription Of Vodafone Play 4 months

Vodafone Offers 3 Months Free Subscription Of Play App Photo,Image,Pics-

ఇప్పుడు జియో సిమ్ వాడుతన్న వినియోగదారులకి, జియో అందిస్తున్న ఆప్స్ లో ఫేవరేట్ ఆప్ ఏది అంటే ఎక్కువమంచి జియో సినిమా అని చెబుతారు. ఆ తరువాత జియో మ్యూజిక్ అని చెబుతారు. జియో సినిమాలో బాలివుడ్, హాలివుడ్, పంజాబీ సినిమాల కలెక్షన్ పెద్దగానే ఉంది. ఈ మధ్య ప్రిమియం ఇంగ్లీష్ టీవి సీరీస్ కంటెంట్ ని కూడా అందించడం మొదలుపెట్టింది జియో. ఇక జియో మ్యూజిక్ లో భారతీయ భాషల్లోని సినిమా పాటల కలెక్షన్ చాలా పెద్దగా ఉంది. ఇక మరో అద్భుతమైన ఆప్ జియో టీవి. ఇందులో వివిధ భాషల్లోని ఛానెల్స్ ఫ్రీగా ప్రసారితం అవుతున్నాయి. సంగీత అభిమానులకి, సినిమా అభిమానులకి, టీవి అభిమానులకి డిసెంబరు 31 తేదివరకు ఈ ఆప్ సర్వీసులను పూర్తి ఉచితంగా అందిస్తోంది జియో.

మరి జియో సిమ్ లేనివారి పరిస్థితి ఏంటి? జియో సిమ్ సులువుగా దొరక్కపోవచ్చు కాని వొడాఫోన్ సులువుగానే దొరుకుతుందిగా. ఇప్పటికే మీరు వొడాఫోన్ వినియోగదారులైతే సగం పని అయిపోయినట్టే. ఓ మూడు నెలల వరకు వొడాఫోన్ వినియోగదారులు జియో సర్వీసులని మించిన ఉచిత లైవ్ టీవి, ఉచిత సినిమాలు, ఉచిత మ్యూజిక్ సర్వీసులను పొందవచ్చు. అది కూడా ఒకే ఆప్లికేషన్ లో. దాని పేరే Vodafone Play.

ఈ యాప్ లో 180 టీవి ఛానెళ్ళు, 14 వేలకు పైగా సినిమాలు (తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి), 12 లక్షలకు పైగా ఆడియో, వీడియో సాంగ్స్ ని పొందుపరిచిందట వొడాఫోన్. (ఈ లెక్కలతో వెబ్ సైట్ కి సంబంధం లేదు, పూర్తిగా వోడాఫోన్ అందించిన రిపోర్టు ఇది). కాబట్టి, వోడాఫోన్ యూజర్లంతా వెంటనే తమ ప్లే స్టోర్ నుండి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోని మూడు నెలలపాటు పండగ చేస్కోండి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?

About This Post..వొడాఫోన్ సిమ్ ఉంటే పండగ చేస్కోండి

This Post provides detail information about వొడాఫోన్ సిమ్ ఉంటే పండగ చేస్కోండి was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

Vodafone Play app, Vodafone offers 3 months free subscription of Vodafone Play, Vodafone, Vodafone offers Play app, jio Services

Tagged with:Vodafone Play app, Vodafone offers 3 months free subscription of Vodafone Play, Vodafone, Vodafone offers Play app, jio Servicesvodafone,Vodafone offers 3 months free subscription of Vodafone Play,Vodafone offers Play app,Vodafone Play app,,