వణికిన "విశాఖ"

అందమైన సముద్రం ఆస్వాదించడానికి ఎంత బావుంటుందో.అదే సముద్రం ఉగ్ర రూపం దాల్చితే అంతే భయంకరంగా ఉంటుంది అనడానికి సరైన సాక్ష్యం హుదూద్ తుఫాను.

 Vishaka People Tense About “sea”-TeluguStop.com

అయితే అది జరిగిపోయి, ఆ పీడకలని మరచిపోతున్న విశాఖ వాసులను మళ్లీ అదే తరహాలో భయానక వాతావరణానికి గురిచేసింది నగర వాతావరణం.ఉన్నట్టు ఉండి సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగసిపడుతూ మళ్లీ తన ఉగ్ర రూపాన్ని చూపించేలా కనిపించింది.

అంతేకాకుండా ఆ ఫలితంగా సాగరం బాగా ముందుకువచ్చి.తీరాన్ని భారీగా కోసేసింది.అలల ధాటికి విశాఖలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర రక్షణ గోడ కూలిపోయింది.మరికొద్దిసేపటికే… అలలు మరింత ముందుకు వచ్చి.నడకదారిని కూడా కోసేశాయి.దీనితో అప్రమత్తమైన అధికారులు బీచ్ రోడ్ లో రాకపోకలు నిలిపివేశారు.ఇక ఆ పరిస్థితిని అధికారులు అందరూ కలక్టర్ తో సహా సమీక్షించి తదుపరి చర్యలపై చర్చించారు.ఇక మరోపక్క ప్రజలను ఇంత కలవరానికి గురి చెయ్యడానికి కారణం ఏమీ లేదు అని బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే అలల ఉధృతి పెరిగిందని, కాకపోతే.

హుద్ హుద్ తీవ్రత వల్ల తీరం బాగా బలహీనపడిందని.దీని వల్ల.

సముద్రం ముందుకు వచ్చి ఉంటుందని వాతావరణ శాఖ, మరియు సముద్ర అధ్యయన నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇక ఈ మార్పుతో భయబ్రాంతులైన నగరవాసులు, తీరప్రాంత ప్రజలు ఆరంభంలోనే ఇలా కలవరపెడితే రానున్న రోజుల్లో ఏమవుతుందో అని భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube