క్రేజీ కాంబో.. వినాయక్ నిర్మాతగా భరణి సినిమా..!

టాలీవుడ్ లో ఉన్న కమర్షియల్ డైరక్టర్స్ లో వినాయక్ పేరు మారు మోగడం కామనే.అయితే ఓ పక్క తన దర్శకత్వంలో సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా మారాలన్నది వినాయక్ కోరిక.

 Vinayak Turns As Producer For Tanikella Bharani-TeluguStop.com

సినిమా నిర్మాతగా వినాయక్ మంచి ఐడియాలజీ ఉందట.ఇప్పుడది కార్యరూపం దాల్చబోతుంది.

క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో చాలా మంచి అభినయం అనుభవం ఉన్న తణికెళ్ల భరణి దర్శకత్వంలో వినాయక్ నిర్మాతగా ఓ సినిమా రాబోతుంది.ఏంటి భరణి డైరక్షన్ వినాయక్ ప్రొడ్యూసర్ గానా ఇదేం కాంబినేషన్ అని షాక్ అవ్వకండి.

వీరు కలిసి చేసేది చిన్న సినిమా అదేనంటి షార్ట్ ఫిల్మ్.

సిరా షార్ట్ సినిమాతో తనలోని దర్శకత్వ ప్రతిభ చాటిన తణికెళ్ల భరణి మిథునం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

కొద్దిరోజుల క్రితం మంచు విష్ణుతో భక్తకన్నప్ప సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చినా బడ్జెట్ ప్రాబ్లెంతో అది తెరకెక్కించే వీలు కాలేదు.ప్రస్తుతం భరణి గారు ‘లాస్ట్ ఫార్మర్’ అనే కథను రెడీ చేశారట.

అది కాస్త వినాయక్ కు చెప్పడంతో ఆ షార్ట్ ఫిల్మ్ తానే ప్రొడ్యూస్ చేస్తానని మాటిచ్చారట.మరి తణికెళ్ల భరణి నుండి వస్తున్న ఈ లాస్ట్ ఫార్మర్ ఎలాంటి సెన్షేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube