Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మంచి పని చేస్తున్న వినాయక్-Vinayak To Compensate Akhil Losses

వివి వినాయక్ అఖిల్ ఫ్లాప్ భారాన్ని తన మీద వేసుకుంటున్నారు. తన మీద నమ్మకం పెట్టుకోని గుడ్డిగా డబ్బు పెట్టేసిన వాళ్ళందరికి తనవంతు సాయం చేస్తున్నారు. అక్కినేని అఖిల్ ని పరిచయం చేస్తూ, వినాయక్ తీసిన అఖిల్ – ది పవర్ ఆఫ్ జువా దాదాపు 50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

మొదటిరోజు 10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ తో బోణి బాగానే కొట్టిన అఖిల్, దాని తరువాత ఆ స్పీడ్ ను కంటిన్యూ చేయలేక చతికిలపడింది. ఇప్పటివరకు 20 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిన అఖిల్ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ లెక్కన దాదాపు 30 కోట్ల నష్టాలు తప్పేలా లేదు.

తనను నమ్మి డబ్బు పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చిన నష్టాల్లో కొంతభాగం తాను భరిస్తానని మాటిచ్చారు వినాయక్. గతంలో ఆగడు సినిమాకి వచ్చిన నష్టాల్ని కూడా కొంతవరకు భరించారు శ్రీనువైట్ల. కాని ఆ విషయం మీడియా దాకా రాలేదు. వినాయక్ సినిమా పట్ల బాధ్యత తీసుకోవడం నితిన్ కి కాస్త ఊరటనిచ్చే వార్తే. ఏదెమైనా ఇలా బయ్యర్ల పట్ల దర్శకులు బాధ్యత తీసుకోవడం శుభ పరిణామం.

Continue Reading
To Top