యంగ్ రెబల్ స్టార్ బాహుబలి రెండొవ భాగానికి సిద్ధం అవుతున్నాడు.అందులో ఏమాత్రం సందేహం పెట్టుకోవద్దు.
కాని బాహుబలి నుంచి ప్రభాస్ తీసివేయడం కుడా నిజమే.కన్ఫ్యూజ్ అవుతున్నారా?
ప్రభాస్ రెండొవ భాగం వరకే ఉంటాడట.ఒక జాతీయ వెబ్ సైట్ కథనం ప్రకారం ఈ విషయాన్ని స్వయంగా బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.బాహుబలి రెండొవ భాగంలోనే ప్రభాస్ పాత్ర ముగుస్తుందట.
మూడొవ భాగంలో కట్టప్ప ఉండటం కూడా అనుమానమే అంట.భల్లాలదేవుని అంతంతో ముగిసే బాహుబలి రెండొవ భాగానికి, పూర్తిగా కొత్త కథతో తెరకెక్కే మూడొవ భాగానికి ఏమాత్రం సంబంధం ఉండదట.అయితే ప్రభాస్ స్థానంలో వచ్చే హీరో ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు.
మూడొవ భాగానికి సంబంధించి పనులు ఇప్పటికే మొదలయ్యాయి.బాహుబలి మూడొవ భాగానికి కథ సిద్ధం చేసే పనిలో బిజిగా ఉన్నారు విజయేంద్ర ప్రసాద్.ఇక బాహుబలి రెండొవ భాగం షూటింగ్ ఈ నెల 15 నుంచి మొదలవుతుంది.
ముందు చెప్పినట్టుగానే వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదల అవుతుంది.