Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కేబినెట్ మంత్రిగా విజ‌య‌శాంతి..!-Vijayashanti In Tamil Nadu Cabinet

వెండితెర‌పై ఎంతోమంది స్టార్ హీరోల‌తో న‌టించి ఓ వెలుగు వెలిగింది లేడీ సూప‌ర్‌స్టార్ అమితాబ‌చ్చ‌న్‌. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా స‌త్తా చాటిని ఆమె పొలిటిక‌ల్‌గా మాత్రం వ‌రుస‌గా ప్లాప్ షోలు వేస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన రాముల‌మ్మ త‌ర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెద‌క్ ఎంపీగా కూడా గెలిచారు. కేసీఆర్‌తో తీవ్ర‌స్థాయిలో విబేధాలు రావ‌డంతో రాముల‌మ్మ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లోకి జంప్ చేసి మెద‌క్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయిన విజ‌య‌శాంతి గ‌త కొద్ది రోజులుగా త‌మిళ‌నాడు పాలిటిక్స్‌పై బాగా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అక్క‌డ చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తుగా గ‌ళ‌మెత్తుతున్నారు. తమిళ‌నాడులో డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీలో వుండి కూడా విజయశాంతి శశికళ వర్గాన్ని స‌పోర్ట్ చేస్తుండ‌డంతో రాజ‌కీయంగా చాలా సందేహాల‌కు తావిస్తోంది.

అమ్మ జ‌య‌ల‌లిత‌, చిన్నమ్మ లేని అన్నాడీఎంకే పార్టీలో కీల‌క‌మైన మ‌హిళ‌లు లేకుండా పోయారు. దీంతో విజ‌య‌శాంతిని ప‌ళ‌నిస్వామి కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని చిన్న‌మ్మ ప్లాన్‌గా తెలుస్తోంది. విజ‌య‌శాంతి త‌మిళ‌నాడు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తే అక్క‌డ అన్నాడీఎంకేకు పార్టీ గ్లామ‌ర్ కూడా యాడ్ అవుతుంద‌ని త‌మిళ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న మాట‌.

ఇక విజ‌య‌శాంతి తెలుగుమ్మాయి అయినా ఇక్క‌డ సినీజ‌నాల‌కు ఎంత ప‌రిచ‌య‌మో..త‌మిళ సినీజ‌నాల్లో కూడా ఆమెకు అంతే క్రేజ్ ఉంది. ఆమె అక్క‌డ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి చాలా మంది హీరోల‌తో న‌టించింది. మ‌రి విజ‌య‌శాంతి ప‌ళ‌నిస్వామి కేబినెట్‌లోకి చేరే వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజం అవుతాయో చూడాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    YS Jagan Tension Over increase in MLA Seats

    By

    అవును! నిజ‌మే! ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాల‌ను 225 కి పెంచాల‌న్న విభ‌జ‌న చ‌ట్టంలోని క్లాజుల‌కు అనుగుణంగా ఏదో...

  • News

    Protests Against Pawan Kalyan

    By

    జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీకి రెడీ అవుతున్నారు. ఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా...

  • News

    Three Trs Leaders Tension over Ramesh Rathod TRS Entry

    By

    ఒకే ఒక్క‌డు తెలంగాణ‌లో ముగ్గురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను తెగ టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. ఆయ‌న త‌మ పార్టీలో చేరితే ఎక్క‌డ త‌మ...

  • News

    Raw, real and —-… RGV strikes big with Guns and Thighs

    By

    “Guns and Thighs” నిన్న సాయంత్రం విడుదలైన ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్నాళ్లు సెన్సార్ బోర్డు...

To Top