పెళ్ళిచూపులు 3 రోజుల కలెక్షన్ రిపోర్టు

స్టార్ డైరెక్టర్ లేడు, స్టార్ హీరో లేడు, స్టార్ హీరోయిన్ కాని నిర్మాత కాని లేరు.విడుదలకి 3 రోజుల ముందే విమర్శకులకి ఒక స్పెషల్ షో వేసారంటేనే అర్థం చేసుకోండి, సినిమా మీద ఎంత నమ్మకంగా ఉన్నారో యూనిట్ సభ్యులు.

 Pelli Choopulu Weekend Collection Report-TeluguStop.com

సురేష్ బాబు అండదండలతో సినిమా థియేటర్లలోకి రాగానే ప్రేక్షకులు కూడా విమర్శకుల మాదిరిగానే ఘనస్వాగతం పలికారు సినిమాకి.

అమెరికాలో అయితే చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

ఏదో నితిన్, రామ్, వరుణ్ తేజ్ లాంటివారి సినిమా అన్నట్టు తొలి వికేండ్ లో $293k వసూలు చేసి ఇప్పటికే ఓవర్సీస్ లో పెద్ద హిట్ గా నిలిచింది ఈ చిత్రం.తెలుగు రాష్ట్రాలు కలుపుకోని, తొలిమూడు రోజుల్లో మూడున్నర కోట్లకు పైగా షేర్ రాబట్టింది ఈ సినిమా.

లాభాలు మొదలయ్యాయి.

సినిమా అంత బాగుంది కాబట్టే, రాజమౌళి చూసి అదేపనిగా పొగుడుకుంటూ పోయారు.

హ్యాపి డేస్ వెనుక శేఖర్ కమ్ముల ఉన్నట్లు, ఈ సినిమా వెనుక ఒక బ్రాండ్ నేమ్ ఉండుంటే, ఎక్కువ థియేటర్లలో విడుదలై, మరింత కలెక్ట్ చేసేదేమో.థియేటర్లు తక్కువే ఉన్నా, అదరగొడుతోంది పెళ్ళిచూపులు.

సునీల్ జక్కన్న ఓపక్క ఆడుతున్నా, ఈ చిన్ని చిత్రానికి ప్రేక్షకులు తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube