అతి తక్కువ సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన హాట్ బ్యూటీ అమలా పాల్ తెలుగులో ప్రేమఖైది డబ్బింగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆ తర్వాత రాం చరణ్ నాయక్ లో నటించందనుకోండి.
కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడిన అమలా ఇప్పుడు అతనితో వేరుగా ఉంటుందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తుంది.ఇక వస్తున్న ఈ వార్తను ఖండించని కారణంగా అమలా, విజయ్ లు డివైడ్ అవ్వడం ఫిక్స్ అంటున్నారంతా.
ఇక వారిద్దరు విడిపోయేందుకు కారణాలేన్నో తెలియదు కాని సమంత తీసుకున్న ఓ నిర్ణయం ఆ ఇద్దరిని దూరం చేసింది అని మీడియా అంటుంది.
అదెలా అంటే నాగ చైతన్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంత పెళ్లి చేసుకునే క్రమంలో తమిళంలో ధనుష్ తో చేయాల్సిన వడ చెన్నై మూవీ నుండి వాకవుట్ చేసింది.అయితే ఆ ఆఫర్ అమలా పాల్ దగ్గరకు వెళ్లింది.
ధనుష్ సినిమా అంటే నచ్చని విజయ్ ఆ అవకాశం వదలమని చెప్పినా అమలా మాత్రం తాను చేయాల్సిందే అంటూ పట్టుబట్టిందట.ఈ కారణం చేతే ఆ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకునేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
సో ఓ విధంగా వడ చెన్నై నుండి సమంత బయటకు రాకుండా ఉంటే అమలా, విజయ్ ల మధ్య గొడవలు వచ్చి ఉండేవే కాదు అని కోలీవుడ్ హాట్ న్యూస్.మరి స్టార్ జంట నిజంగానే విడిపోతారా లేక కలిసి ఉంటారా అన్నది వారిరువురిలో ఒక్కరైనా నోరు తెరిస్తే తెలుస్తుంది.