$ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరమో, స్కూల్స్ లో $ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వాలో, ఆ పాఠాల్ని స్టూడెంట్స్ ఎందుకు శ్రద్ధగా వినాలో చెప్పే సంఘటన ఇది.స్కూల్స్, కాలేజీల్లో (అన్నికాదు) రిప్రొడక్టివ్ సిస్టం గురించి పాఠాలు చెప్పేటప్పుడు ఒక కండోం ఎలా వాడాలో కూడా చెబుతారు.
అరటిపండు, కండోం ఉపయోగించి ఉదహారణలు చెబుతారు .కాని ఈ పాఠాల్ని పెడచెవిన పెట్టినట్టు ఉండి ఓ స్టూడెంట్ జంట.కండోం అవసరాన్ని పట్టించుకోకుండా, కండోంకి బదులుగా ప్లాస్టిక్ కవర్ (కొంచెం గట్టిగా ఉండేది) $ లో వాడారు.అప్పుడు ఏం జరిగి ఉంటుందో ఊహించగలరా ? ఏముంది కండోం చిరిగి అమ్మాయి గర్భం దాల్చింది అని అనుకుంటున్నారా .అది కాదు జరిగింది.
ఎప్పుడైనా ఏదైనా గట్టిగా ఉండే ప్లాస్టిక్ కవర్ తో ఆడి చూడండి .అది మీ చేతుల మీద గాయం చేయగలదు.అంటే గాటు పెట్టగలదు.
రక్తాన్ని చూడగలదు.వీరి విషయంలో అదే జరిగింది.
ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని రఫ్ $ చేయడం వలన ఇద్దరి జననాంగాలకి గాయాలయ్యాయి.ఇద్దరికీ రక్తం బయటకివచ్చింది.
వీరికి చికిత్సనందిస్తున్న డాక్టర్ నూయేన్ ద లువాంగ్ ఈ విషయాన్ని బయటపెట్టారు.ఇప్పుడు డాక్టర్లు వీరికి నిర్వహిస్తున్న మరో పరీక్ష దేనికోసం అంటే .వీరు వాడిన కవర్ ఫ్రెష్ గా ఉన్నదా లేక ఎక్కడినుంచో తీసుకొచ్చారా .దానికే గనుక బ్యాక్టీరియా ఉంటే వీరికి లేని ఇన్ఫెక్షన్స్ రావొచ్చు.
చూసారా .ఒక్క చెత్త ప్రయోగం ఎంత నష్టాన్ని కలిగించిందో.ఇంతకీ వీరు కండోం ఎందుకు వాడలేదు ? అదేమీ పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు కదా అని మీకు అనుమానం వచ్చిందా ? వీరు కండోం కొనలేదు, కాని డబ్బులు లేక కాదు, మొహమాటం కొద్ది.వెళ్లి కండోం కావాలని దుకాణంలో అడిగేందుకు ధైర్యం చాలక.
ఈ మొహమాటం ఎంతోమందికి ఉంటుంది.కాని మొహమాటానికి పొతే ఇలాంటి సమస్యలే వస్తాయి.
అలాగే $ ఎడ్యుకేషన్ సరిగా లేకపోతే ఇలాంటి దెబ్బలే తింటారు టీనేజర్స్.