చిరు విలన్ మరి అంత చీపా..!

మెగాస్టార్ 150వ సినిమా ఓ పక్క శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నా ఆ సినిమాలో ఇంకా స్టార్ కాస్ట్ సెలెక్షన్ జరుగుతూనే ఉంది.అంత చేస్తున్నా హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వని ఈ సినిమాలో విలన్ గా అంజలా జవేరి భర్త తరుణ్ అరోరాను సెలెక్ట్ చేశారు.

 Very Cheap Villain For Megastar 150-TeluguStop.com

అయితే విలన్ ఎంపిక మీద నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు.జబ్ వి మెట్ సినిమాలో కరీనాను వదిలించుకునే పాత్రలో మెరిసిన తరుణ్ మెగాస్టార్ విలన్ గా సెలెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు కేవలం 10 లక్షలు మాత్రమే ఇస్తున్నారట.మెగాస్టార్ చేయక చేయక చేస్తున్న మూవీలో ఇంత కాస్ట్ కటింగ్ ఉండటం గొప్ప విషయం.

ఇక సినిమాలో హీరోయిన్ గా కూడా కోట్ల కోట్లు ఇచ్చి తీసుకోవడం కన్నా త్రిష లాంటి హీరోయిన్స్ నే ప్రిఫర్ చేస్తున్నారట.కంటెంట్ ఉంటే చాలు ఎలాంటి ఆర్టిస్ట్ అయినా సరే హిట్ కొట్టేయొచ్చు అన్న మెగా ప్లాన్ వర్క్ అవుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube