మలయాళ దర్శకుడిని ఫైనల్ చేసిన వెంకీ

విక్టరీ వెంకటేష్ బాబు బంగారంతో మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే తన మార్క్ కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేసిన వెంకటేష్ ఇకనుండి ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఆ క్రమంలోనే ఇప్పటికే సాలా ఖద్దూస్ సినిమా రీమేక్ కు సంసిద్ధమవుతున్న వెంకటేష్ ఆ సినిమా తర్వాత మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

 Venkatesh Movie With Malayalam Director-TeluguStop.com

దృశ్యం సినిమాతో సౌత్ భాషలన్నిటిలో క్రేజ్ సంపాదించిన జీతు జోసెఫ్ రీసెంట్ గా వెంకటేష్ తో కథా చర్చల్లో పాల్గొన్నాడట.

జీతు జోసెఫ్ చెప్పిన కథ నచ్చిన వెంకటేష్ సినిమా చేసేద్దాం అనేశాడట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరిలో స్టార్ట్ అవ్వొచ్చట.బాబు బంగారం హిట్ ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్ సాలా ఖద్దూస్ ను ఆ సినిమా మాత్రుక దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలోనే చేస్తున్నాడు.

గోపాల గోపాల తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న వెంకటేష్ కు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి.అందుకే అంచనాలను అందుకునేలా మారుతితో కలిసి బాబు బంగారం అంటూ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చి హిట్ అందుకున్నాడు.

మరి దృశ్యం రీమేక్ తోనే దడలాడించిన వెంకటేష్ ఆ సినిమా డైరెక్టర్ తో స్ట్రైట్ సినిమా చేస్తుండటంతో ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక మూవీకి సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube