అవికా ప్రేమలో వెంకీ!

విక్టరీ వెంకటేష్‌ ఇకపై వయస్సుకు తగ్గ పాత్రల్లో నటించాని నిర్ణయించుకున్నట్లున్నాడు.ఈయన ఇప్పటికే ‘గోపాల గోపాల’ మరియు ‘దృశ్యం’ సినిమాలో మద్య వయస్కుడి పాత్రలో నటించి మెప్పించాడు.

 Victory Venkatesh To Pair With Avika Gor-TeluguStop.com

త్వరలోనే చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పాడు.ఆ సినిమాలో సైతం వెంకటేష్‌ మద్య వయస్కుడి పాత్రలో కనిపించనున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

పిల్లల తండ్రిగా వెంకటేష్‌ కనిపిస్తాడని, అదే సమయంలో ఈయన ఒక ప్రేమ కథను కూడా నడిపిస్తాడు అంటూ కథ తెలిసిన కొందరు వెంకీ తర్వాత సినిమా గురించి హింట్‌ ఇస్తున్నారు.

అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో వెంకీ మద్య వయస్కుడిగా కనిపిస్తూనే, ఒక టీనేజ్‌ అమ్మాయి ప్రేమలో పడి, ఆ అమ్మాయి వెనుక తిరిగే వాడిలా కనిపించనున్నాడు.

ఇటీవలే వచ్చిన‘దిక్కు చూడకు రామయ్యా’ అనే సినిమా తరహాలోనే ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.అయితే ఆ సినిమాలో తండ్రి, కొడుకు ఒకే అమ్మాయికి లైన్‌ వేస్తూ ఉంటారు.

కాని ఈ సినిమాలో మాత్రం వెంకీ తన పెళ్లంపై అభిమానం ఉన్నా కూడా ఆ టీనేజ్‌ అమ్మాయి ప్రేమ కోసం తపిస్తూ ఉంటాడు.ఆ టీనేజ్‌ అమ్మాయిగా అవికాగౌర్‌ నటించనున్నట్లుగా సమాచారం అందుతోంది.

అతి త్వరలో ఈ సినిమాను ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు.మరి అవికా వెంట పడే వెంకీని ప్రేక్షకులు ఆధరిస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube