మహిళా జర్నలిస్ట్ కి వెంకటేష్ చురక

టీడీపీ రాజ్యసభ అభ్యర్థి టీజీ వెంకటేశ్ ఓ తెలుగు టీవీ ఛానెల్ కు చెందిన మహిళా ప్రతినిధికి చురకలంటించారు.అప్పటిదాకా బరిలోనే లేని టీజీ వెంకటేశ్… చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి టికెట్ సాధించిన సంగతి తెలిసిందే.

 Venkatesh Comments On Journalist-TeluguStop.com

కొద్దిసేపటి క్రితం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు హైదరాబాదులోని అసెంబ్లీకి వచ్చిన టీజీవీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన ఓ మహిళా జర్నలిస్టు పలు ప్రశ్నలు సంధించారు.

ఈ క్రమంలో మంచి లాబీతోనే సీటు సాధించారుగా అన్న ఆమె ప్రశ్నకు టీజీవీ వేగంగా స్పందించారు.

చిన్న పిల్లల్లా ప్రశ్నలేస్తారంటూ ఆమెపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.ఇలాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెబతామంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అప్పటిదాకా ఆ మహిళా జర్నలిస్టు ప్రశ్నలకు నవ్వుతూనే సమాధానం చెప్పిన టీజీవీ… లాబీ ప్రస్తావన రాగానే ఇక ఇంటర్వ్యూ ముగిసిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలోనూ టీజీవీ తన ముఖంలో చిరునవ్వుకు మాత్రం స్వస్తి చెప్పలేదు.

నవ్వుతూనే టీజీవీ ఆమెకు చురకలంటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube