స్టార్ హీరో'స్ ని టార్గెర్ చేసిన డైరెక్టర్ -Veeru Potla Targets Star Heros 3 months

 Photo,Image,Pics-

కామెడీ డైరక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించిన వీరు పోట్ల ఈమధ్యనే సునీల్ తో ఈడు గోల్డ్ ఎహే సినిమా తీశాడు. సినిమా టాక్ యావరేజ్ గా ఉంది. అయితే సినిమాను ఒడ్డున పడేసేందుకు సునీల్ ఇంకా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు అయితే బిందాస్, దూసుకెళ్తా, రగడ సినిమాలతో పోల్చుకుంటే వీరు ఈ సినిమాలో తన ప్రతిభ తగ్గినట్టు కనిపించింది. అంతేకాదు రగడ తర్వాత సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు అసలు ఎందుకు ఇలా అని వీరుపోట్లను అడిగితే తనను ఓ ఇద్దరు హీరోలు మోసం చేశారన్నట్టు మాట్లాడాడు.

ఇంతకీ వీరుని మోసం చేసిన ఆ హీరోలు ఎవరు అన్నది ఇప్పుడు హాట్ న్యూస్. అయితే అప్పట్లో వెంకటేష్, రవితేజతో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన వీరు పోట్లకు ఆ ఇద్దరు హీరోల దగ్గర నుండి సరైన రెస్పాన్స్ రాలేదట. ముందు చేద్దామని అని తర్వాత హ్యాండ్ ఇచ్చారట. ఇక అదే కథతో వేరే హీరోలను పెట్టి తీసే ప్రయత్నం చేసినా అది కుదరలేదు. అందుకే తన సినిమాకు ఇంత గ్యాప్ తీసుకున్నా అని చెప్పాడు. అంతేకాదు ఆ కథతో చాలామంది నిర్మాతలను కలిశానని కాని ఏ ఒక్కరు తనని నమ్మలేదని అంటున్నాడు. ఎప్పటికైనా సరే ఆ ఇద్దరితో సినిమా తీసి తీరుతా అంటున్నాడు వీరు పోట్ల. మరి ఆ దర్శకుడి ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ

About This Post..స్టార్ హీరో'స్ ని టార్గెర్ చేసిన డైరెక్టర్

This Post provides detail information about స్టార్ హీరో'స్ ని టార్గెర్ చేసిన డైరెక్టర్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Eedu Gold Ehe Movie, Sunil, Director Veeru Potla, Multi Starer Movie, Venkatesh, Raviteja, స్టార్ హీరో'స్ ని టార్గెర్ చేసిన డైరెక్టర్

Tagged with:Eedu Gold Ehe Movie, Sunil, Director Veeru Potla, Multi Starer Movie, Venkatesh, Raviteja, స్టార్ హీరో'స్ ని టార్గెర్ చేసిన డైరెక్టర్,