మంచి టైటిల్‌ పట్టిన మెగా హీరో

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమాలో బన్నీ చెప్పిన ఫీల్‌ మై లవ్‌ డైలాగ్‌ యూత్‌కు బాగా నచ్చింది.

 Varun Tej Next Is Feel My Love-TeluguStop.com

అప్పట్లో తెగ ప్రాచుర్యం పొందిన ‘ఫీల్‌ మై వ్‌’ మరో సారి వార్తల్లోకి వచ్చింది.టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు త్వరలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో ఒక సినిమాను నిర్మించేందు ఏర్పాట్లు చేస్తున్నాడు.

అట్లూరి వెంకీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా దిల్‌రాజు నిర్మించబోతున్న సినిమాకు ‘ఫీల్‌ మై లవ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

ఈనెల మూడవ వారంలో వరుణ్‌ తేజ్‌ నటించిన ‘లోఫర్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా విడుదల అయిన వెంటనే వచ్చే నెలలో ‘ఫీల్‌ మై లవ్‌’ చిత్రాన్ని ప్రారంభించేందుకు దిల్‌రాజు ఏర్పాట్లు చేస్తున్నాడు.ప్రస్తుతం అట్లూరి వెంకీ స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు.

ఒక మంచి ప్రేమ కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.టైటిల్‌ ప్రకటించడంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర నిర్మాత దిల్‌రాజు ఉన్నాడు.

ఇక వరుణ్‌ తేజ్‌ ‘లోఫర్‌’ విషయానికి వస్తే పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.ఆడియోను ఈ వారంలోనే విడుదల చేసి, సినిమాను క్రిస్మస్‌ సందర్బంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube