అఆతో అదిరిపోయే రేంజ్ లో హిట్ అందుకున్న నితిన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తున్నాడు.అయితే వచ్చిన హిట్ తో మరోసారి సినిమాల విషయంలో కన్ ఫ్యూజ్ అవుతున్నాడు నితిన్.
నితిన్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్న వారిలో విజయ్ కుమార్ కొండ ఒకరు.ఇష్క్ తర్వాత చాలా క్యూశియాల్ స్టేజ్ లో గుండెజారి గల్లతయ్యిందే సినిమా హిట్ ఇచ్చిన ఈ డైరక్టర్ మరోసారి నితిన్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట.
అయితే కథ విన్న నితిన్ సెకండ్ హాఫ్ వీక్ గా ఉందని అనేశాడట.ఇక సెకండ్ హాఫ్ మార్చుకుని రాసినా ఫలితం లేకపోవడంతో అదే కథను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు వినిపించాడట విజయ్ కుమార్.
ఫిదా షూటింగ్ లో ఉన్న వరుణ్ తేజ్ కు విజయ్ కథ నేరేట్ చేయగా కథ నచ్చేసిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.నితిన్ కాదన్న కథతో మెగా హీరో సినిమా తీయడం హాట్ న్యూస్ గా నిలిచింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నితిన్ చెప్పిన మార్పులతో వరుణ్ తేజ్ కు కథ వినిపించడం.ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే నితిన్ అనవసరంగా ఓ హిట్ సినిమా మిస్ చేసుకున్నట్టే.
ప్రస్తుతం శ్రీనువైట్లతో మిస్టర్, శేఖర్ కమ్ములతో ఫిదా సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు విజయ్ సినిమాకు కూడా ఓకే చెప్పి మిగతా హీరోలకు షాక్ ఇచ్చాడు.మరి ఈ మూడిట్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా వరుణ్ తేజ్ స్టార్ అయినట్టే లెక్క.