పవన్ ఎన్టీఆర్ ను ఓడించిన వరుణ్ తేజ్

ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తుందో చెప్పలేం.ఇక్కడ హీరో అయిన వారు అక్కడ జీరో అవొచ్చు.

 Varun Tej Beats Pawan Kalyan And Ntr-TeluguStop.com

ఉదాహరణకి చెప్పాలంటే బోయపాటి శ్రీను సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో దంచితే, ఓవర్సీస్ లో మాత్రం తుస్సుమంటాయి.పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ ల సినిమాలు కూడా అంతే.

శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను … ఇద్దరిలో పెద్ద మార్కెట్ ఉన్న దర్శకుడు ఎవరు అంటే వెంటనే బోయపాటి అనేస్తాం … కాని ఓవర్సీస్ వరకు అతిపెద్ద బ్రాండ్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల.రాజమౌళి, త్రివిక్రమ్ తరువాత అక్కడ క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఆయనే.

ఈ స్టేట్మెంట్ కి ఫిదా ఓ రుజువు.ఇంతింతై వటుడింతై అన్నట్టు, చిన్న సినిమా కాస్త పెద్దగా మారింది.

ఓవర్సీస్ లో మాత్రమె కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదరగోట్టింది.ఇక అమెరికాలో అయితే ఆ రేంజ్ వేరు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా అత్తారింటికి దారేది.ఎన్టీఆర్ కెరీర్ లో ఓవరాల్ గా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా జనతా గ్యారేజ్.

ఈ రెండిటిని అమెరికాలో దాటేసింది ఫిదా.మరో విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక ఓవర్సీస్ కలెక్షన్లు సాధించిన నాన్నకు ప్రేమతో చిత్రానికి కూడా ఎంతో దూరంలో లేదు ఫిదా.

అమెరికాలో టాప్ 20 చిత్రాలేంటో చూడండి.:

1) Baahubali-The Conclusion : $21M
2) Baahubali-The Beginning : $8.46M
3) Srimanthudu : $2.89M
4) A Aa – $2.49M
5) Khaidi No 150 : $2.44M
6) Nannaku Prematho : $2.02M

7) Fidaa : 1.91M (ఇంకా ఆడుతోంది)


8) Attharintiki Daaredi : $1.89M
9) Janatha Garage : $1.80M
10) Gautamiputra Satakarni : $1.66M
11) SVSC: $1.63M
12) Oopiri : $1.61M
13) Dookudu : $1.56 M
14) Manam : $1.53M
15) Aagadu : $1.48M
16) Dhruva : $1.47M
17) Bhale Bhale Mogadivoy : $1.43M
18) Race Gurram : $1.39M
19) 1 Nenokkadine : $1.33M
20) Baadshah : $1.27M

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube