వరుణ్ సందేశ్ భార్య ఆత్మహత్యయత్నం .. నిజమా కాదా ?

యువనటుడు వరుణ్ సందేశ్ గుర్తున్నాడా ? ఎలా మరచిపోతారు లెండి .ఓ సమయంలో హ్యాపి డేస్, కొత్త బంగారు లోకం లాంటి భారి విజయాలతో సంచలనాలు సృష్టించాడు.

 Varun Sandesh’s Wife Dead.. Rumors Took Birth And Death-TeluguStop.com

ఆ తరువాత మంచి సినిమాలు చేయక, మార్కెట్ పోగొట్టుకోని, అచ్చం తరుణ్, ఉదయ్ కిరణ్ లాగా సైడ్ అయిపోయాడు.ఈ కుర్ర హీరో వితిక షేరు అనే మరో యువనటిని ప్రేమించి వివాహమాడిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి నిశ్చితార్థం డిసెంబర్ 7, 2015 లో జరగగా, 2016వ సంవత్సరం ఆగస్టు 19న పెళ్ళి చేసుకున్నారు.పెళ్ళి తరువాత కొంతకాలం అమెరికాలో ఉండిపోయిన ఈ జంట, ఈమధ్య ఇండియాలోనే కనిపిస్తున్నారట.

అయితే నిన్న ఒక్కసారిగా సోషల్ మీడియాలో వరుణ్ సందేశ్ భార్య ఆత్మహత్యయత్నం చేసుకుందని, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతోందని వార్తలు వచ్చాయి.దీని వెనుక వరుణ్ సందేశ్ వేధింపులు ఉన్నాయని, ఇద్దరు విడాకులు తీసుకుందామనుకున్నా, వరుణ్ అందుకు ఒప్పుకోకపోవడంతో వితిక ఆత్మహత్యాయత్నం చేసిందని రూమర్లు పుట్టుకొచ్చాయి.ఇదంతా నిజమేనేమో అని అంతా అనుకుంటున్న సమయంలో స్వయంగా వితిక వచ్చి అసలు నిజం బయటపెట్టింది.“నా మీద, వరుణ్ మీద వస్తున్న వార్తల్లో నిజం లేదు.ఇద్దరం బాగా ఉన్నాం” అంటూ మొదట ట్వీట్ పెట్టిన వితిక, ఆ తరువాత ఓ టీవి ఛానెల్ లో తో మాట్లాడుతూ రూమర్లను కొట్టిపడేసింది.

పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో కలిసి నటించిన వరుణ్ – వితిక, ఆ సెట్లోనే కలిసిపోయి మనసులు కలుపుకున్నారు.

వీటిక అంతకుముందు కొన్ని కన్నడ సినిమాలు, తెలుగులో భీమిలి కబడ్డీ జట్టు, ఝుమ్మంది నాదం సినిమాలు చేసింది.పెళ్ళి తరువాత సినిమాలు మానేసింది వితిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube