చిరు ఫస్ట్ లుక్ గురించి వర్మ ట్వీట్..!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్ నిన్న బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.ఖైది నెంబర్ 150గా చిరు లుక్ అదిరిపోయిందని ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు.

 Varma Positive Response About Chiru First Look-TeluguStop.com

అయితే ఈ లుక్ గురించి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్వీట్ చేయడం విశేషం.ఎప్పుడు తన ట్వీట్స్ తో హాట్ న్యూస్ గా నిలిచే వర్మ ఈసారి కొత్తగా చిరు ఫస్ట్ లుక్ పై తన బెస్ట్ విశెష్ అందించడం జరిగింది.

మెగాస్టార్ మొత్తం కెరియర్ లో ఇదే బెస్ట్ లుక్ అని.ఫస్ట్ లుక్ లో చిరు చాలా క్లాసీగా ఉండటమే కాదు ఇంటెన్స్ కూడా తెలియ చేస్తుందని వర్మ ట్వీట్ చేశాడు.

అయితే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ అది వర్మ దగ్గర నుండి రావడం ఎవరు ఊహించలేకపోతున్నారు.ఎప్పుడు సెటైరికల్ గా ట్వీట్స్ వేసే వర్మ సడెన్ గా ఇంతలా చేంజ్ అయ్యాడేంటి అని అందరు డౌట్ పడుతున్నారు.

అయితే మరో పక్క మెగా అభిమానులతో పెట్టుకోవడం ఎందుకని ఏదో ఓ ట్వీట్ వేశాడని కొందరంటున్నారు.ఏది ఏమైనా వర్మనే కదిలించిన ఈ ఫస్ట్ లుక్ కచ్చితంగా సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.

ఇక నిన్న సాయంత్రం మెగా హీరోల సమక్షంలో మెగాస్టార్ 61వ పుట్టినరోజు వేడుకలు శిల్పకళా వేదికలో అద్భుతంగా జరిగాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube