ఏపీ విద్యాశాఖా మంత్రిగా అనిత‌..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం కూడా లేదు.ఓ వైపు నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌తో ఎన్నిక‌ల హీట్ రాజుకుంది.

 Vangalapudi Anitha As Ap Educational Minister..!-TeluguStop.com

చంద్ర‌బాబు కొద్ది రోజుల క్రితం చేసిన ప్ర‌క్షాళ‌న‌లో కొత్త మంత్రులు ఆయ‌న కేబినెట్‌లోకి వ‌చ్చి చేరారు.ఈ కేబినెట్‌తోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

గ‌త ప్రక్షాళ‌న‌లో భారీ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న వారిని బాబు మంత్రులుగా త‌ప్పించేశారు.

ఇక నాడు మంత్రిప‌ద‌వి రాలేద‌ని చాలా మంది సీనియ‌ర్లు ఫైర్ అయ్యారు.

ఈ అసంతృప్తి మంట‌లు ఇంకా చ‌ల్లార‌లేదు.ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న‌వాళ్ల‌లో చాలా మంది భారీగా చేతివాటం చూపించేస్తున్నారు.

వీరితోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే అది ప్ర‌భుత్వంపై భారీ యాంటీ ఎస్టాబ్లిష్ అవ్వ‌డం ఖాయ‌మ‌న్న ఇంటిలిజెన్స్ రిపోర్టులు ఇప్ప‌టికే చంద్రబాబుకు వ‌ద్ద‌కు చేరాయి.

బాబు ఇటీవ‌ల మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ప‌దే ప‌దే స‌ర్వేలు చేయిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మందికి టిక్కెట్లు ఇవ్వ‌ర‌న్న‌ది కూడా అప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.ఇక మ‌రో రెండు మూడు నెల‌ల్లోనే ఆయ‌న మ‌రోసారి మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేసి ఆ కేబినెట్‌తో ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌న్న వార్త‌లు ఇప్పుడు ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో గుప్పుమంటున్నాయి.

ఈ వార్త‌లు లీక్ అవ్వ‌డంతో కొంత‌మంది ఎమ్మెల్యేలు త‌మ‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నార‌ట‌.విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని త‌న స‌న్నిహితులతో చెబుతున్నార‌ట‌.

ఇక రోజా ఇష్యూలో అనిత ఎలా పాపుల‌ర్ అయ్యి చంద్ర‌బాబు వ‌ద్ద మంచి మార్కులు వేయించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక అనిత గ‌తంలో టీచ‌ర్‌గా ప‌నిచేశారు.

ఇప్పుడు త‌న‌కు విద్యాశాఖ వ‌స్తుంద‌ని ఆమె త‌న స‌న్నిహితుల‌తో చెపుతున్నార‌ట‌.మ‌రో ట్విస్ట్ ఏంటంటే ప్ర‌స్తుతం ఈ శాఖ‌ను అదే జిల్లాకు చెందిన గంటా శ్రీనివాస‌రావు చేతుల్లో ఉంది.

అంటే అనిత గంటా పోస్టుకు ఎర్త్ పెడుతున్నారా ? మరి త‌న‌కు ఆ శాఖ వ‌స్తుంద‌ని ఎలా ధీమా వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు ? అన్న సందేహాలు ఇప్పుడు జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube