Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఏపీ విద్యాశాఖా మంత్రిగా అనిత‌..!-vangalapudi Anitha As Ap Educational Minister..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం కూడా లేదు. ఓ వైపు నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌తో ఎన్నిక‌ల హీట్ రాజుకుంది. చంద్ర‌బాబు కొద్ది రోజుల క్రితం చేసిన ప్ర‌క్షాళ‌న‌లో కొత్త మంత్రులు ఆయ‌న కేబినెట్‌లోకి వ‌చ్చి చేరారు. ఈ కేబినెట్‌తోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. గ‌త ప్రక్షాళ‌న‌లో భారీ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న వారిని బాబు మంత్రులుగా త‌ప్పించేశారు.

ఇక నాడు మంత్రిప‌ద‌వి రాలేద‌ని చాలా మంది సీనియ‌ర్లు ఫైర్ అయ్యారు. ఈ అసంతృప్తి మంట‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న‌వాళ్ల‌లో చాలా మంది భారీగా చేతివాటం చూపించేస్తున్నారు. వీరితోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే అది ప్ర‌భుత్వంపై భారీ యాంటీ ఎస్టాబ్లిష్ అవ్వ‌డం ఖాయ‌మ‌న్న ఇంటిలిజెన్స్ రిపోర్టులు ఇప్ప‌టికే చంద్రబాబుకు వ‌ద్ద‌కు చేరాయి.

Continue Reading
More Posts
To Top