Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

యోని షేపు మార్చుకునే ఆపరేషన్ కి డిమాండ్ పెరిగిందట -Vaginal Surgery Demand Increased By 45% – Study

సోషల్ మీడియా, పోర్న్ ఇండస్టీ .. ఈ రెండిటి వలనే చాలామంది యువతియువకులు తమ శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ముక్కు పెద్దగా ఉందని, ఈ హీరోయిన్ లాంటి పెదాలు తనకు లేవని, ఈ హీరో లాంటి గడ్డం తనకు లేదని మధనపడుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియాలో పడే పోస్టులు. పోర్న్ ఇండస్ట్రీలో ఉండే మోడల్స్. మామూలు జనాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారు భూమి మీది నుంచి అలానే ఊడిపడలేదు. వారి వృత్తిలో అలానే ఉండాలి. అలా ఉండాలి అంటే వాళ్ళు వారిని అలా మార్చుకోవాలి. ఒక హీరో తన సిక్స్ ప్యాక్ బాడి కోసం డైట్ మీద లక్షలు ఖర్చుపెడతాడు, గంటలకి గంటలు జిమ్ లో గడుపుతాడు. వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు ఇక్కడ. వారి లుక్స్ మీద పెట్టుబడి పెడుతున్నారు. ఆ లుక్స్ తోనే కోట్లు సంపాదిస్తున్నారు. వారికి ఇంకో పని ఉండదు. కాని మనం అలా కాదు కదా. ఆ విషయాలు అర్థం కాకే కాస్మోటిక్ సర్జరీలు పెరిగిపోతున్నాయి.

అందులో ఈమధ్య డిమాండ్ పెరిగన కాస్మోటిక్ సర్జరీల్లో Labiaplasty కూడా ఉందట. ఇదేం సర్జరీ .. మొదటి సారి పేరు వింటున్నారా ? ఇది యోనికి చేసే సర్జరీ. అంటే యోని కనిపించే విధానంలో ఎలాంటి మార్పులు అయితే కావాలో, అలాంటి మార్పులు చేయించుకోవచ్చు అన్నమాట. ఇలాంటి వింత సర్జరీ ఉంటుందా అని ఆశ్చర్యపోకండి .. నిజంగానే ఉంది. ఈ సర్జరికి డిమాండ్ 2015 తో పోల్చుకుంటే ఇప్పటికి 45% పెరిగిందని చెబుతున్నారు డాక్టర్స్. అయితే గుణాంకాల్లో ఇది ఇంకా బ్రెస్ట్ ఎన్లర్జ్మేంట్ (రొమ్ముల సైజు పెంచడం), లిప్ జాబ్ దాకా చేరుకోలేదని, కాని భవిష్యత్తులో ఇది అక్కడిదాకా చేరుకునే అవకశాలు ఉన్నాయని డాక్టర్ లినా త్రియానా చెబుతున్నారు.

ఈ సర్జరీలో, యోనిలోని మడతలని పెంచడం, తగ్గించడం, వుల్వా ఆకారాన్ని మార్చడం చేస్తారు. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయి కూడా ఇలాంటి సర్జరీ ఒకటి చేయించుకుందట. ఇది ప్రమాదకర సూచనే. పోర్న్ అందరికి సులువుగా దొరకడంతో, వారి శరీర భాగాలని తమ శరీర భాగాలతో పోల్చుకుంటూ, ఇలా ఉంటే భవిష్యత్తులో తమ భాగస్వామి తమ పట్ల ఆసక్తి కనబరచడెమో అనే భయంతో ఈ సర్జరీ చేయించుకుంటున్నారట అమ్మాయిలు.

అంగస్తంభన సమస్య వచ్చి సర్జరీ చేయించుకుంటే అది వేరు విషయం, అలాగే యోని ద్వారాల దగ్గర అనారోగ్యకరమైన వాతావరణం ఉంటే అప్పుడు సర్జరీకి వెళ్ళడం శ్రేయస్కరం. కాని ఇలా ఎవరికీ వారు డిజైనర్లుగా మారి, తమ శరీర భాగాలలో ఇన్ని మార్పులు చేసుకోవడం మంచి విషయం కాదు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా ఉంటుందో యువత.

Continue Reading

Trending…

To Top