యూపీ వైపు రాహుల్ చూపు

బీహార్లో గౌరవనీయమైన గెలుపు సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనబడుతోంది.గత ఎన్నికల తరువాత పూర్తిగా కుదేలైన కాంగ్రెస్కు బీహార్ ఎన్నికలు ఊపిరి పోశాయి.

 Uttar Pradesh Daydreams Begin For Congress-TeluguStop.com

మహా కూటమి కారణంగా 27 స్థానాలు గెలుచుకొని మంత్రివర్గంలో స్థానం సంపాదించింది.బీహార్ గెలుపు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చలవేనని పార్టీ నాయకులు పొగుడుతున్నారు.

పార్టీలో రాహుల్ విలువ పెరిగింది.వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

కానీ కాంగ్రెస్కు ఆ రాష్ట్రాల కంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముఖ్యం.ఆ ఎన్నికలు 2017లో జరుగుతాయి.

అక్కడ అధికారంలోకి వస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ దిల్లీకి చేరుకోవచ్చని కాంగ్రెస్ ఆశ.బీహార్లో అంతకు ముందు అసెంబ్లీలో నాలుగు సీట్లు ఉండగా, మొన్నటి ఎన్నికల్లో 27 సీట్లు వచ్చాయి.యూపీలో కూడా ఇదే జారుతుందని నాయకులు చెబుతున్నారు.ప్రస్తుతం అక్కడి అసెంబ్లీలో 28 సీట్లు ఉన్నాయి.ఈ సంఖ్య బాగా పెరగాలంటే ఇప్పటి నుంచే బాగా కష్టపడాలి.అందుకే రాహుల్ గాంధీ ఈ 23న యూపీలో కిసాన్ యాత్ర పేరుతో పాదయాత్ర చేయబోతున్నారు.

రాహుల్ మొదటి నుంచి రైతు సమస్యలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.పలు రాష్ట్రాల్లో పాద యాత్రలు చేశారు.

గతంలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా పాదయాత్రలు చేశారు.ఇప్పుడు యూపీలో ప్రారంభించారు.

ఎన్నికల నాటికీ చాలా యాత్రలు చేసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube