‘గంగ’ హవా సాగుతోంది

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గంగ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తోంది.ఈ సినిమాకు పెద్దగా పోటీ లేక పోవడంతో నిర్మాత సైతం ఊహించని కలెక్షన్స్‌ను తెచ్చి పెడుతోంది.

 Uttama Villain Didn’t Effect Ganga Collections-TeluguStop.com

మేడే సందర్బంగా విడుదలైన ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లోనే 8 కోట్ల షేర్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.మేడే రోజు విడుదల అవ్వాల్సిన ‘ఉత్తమ విలన్‌’ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదా పడటంతో ‘గంగ’కు కలిసి వచ్చింది.

తమిళంలో ఇప్పటికే విడుదల అయ్యి, సక్సెస్‌ అవ్వడం కూడా ఈ సినిమా ఓపెనింగ్స్‌ భారీగా రావడంలో దోహద పడి ఉంటుందని ట్రేడ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

‘ముని’, ‘కాంచన’ సినిమాల తర్వాత రాఘవ లారెన్స్‌ తెరకెక్కించిన ఈ సినిమాపై మొదటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగానే సినిమా హర్రర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.దాంతో కలెక్షన్స్‌ బాగా వస్తున్నాయి.

‘ఉత్తమ విలన్‌’ వచ్చినప్పటికి కూడా ‘గంగ’పై ప్రభావం పడలేదు.ఇప్పటికే సక్సెస్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ‘గంగ’ హవా ఈ వారం మొత్తం సాగే అవకాశాలున్నాయి.

ఈ నెల 8న ‘లయన్‌’ మరియు ‘దొంగాట’ సినిమాలు విడుదల ఉన్న నేపథ్యంలో ‘గంగ’ కలెక్షన్స్‌పై ప్రభావం పడనున్నాయి.అయితే ఆ సినిమాల ఫలితం అటు ఇటు అయితే ‘గంగ’ మరో వారం దుమ్ము రేపే ఛాన్స్‌ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube