చిన్నగా అనిపించే క్యాన్సర్ లక్షణాలు ఇవి ... జాగ్రత్త

సినిమాల్లో ఒక పాత్రకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఎలా చూపిస్తారు ? ఏ సినిమా అయినా చూడండి, ఒకటే లక్షణం .రక్తం కక్కుకుంటారు.

 Unpopular Signs Of Cancer-TeluguStop.com

ఆ సినిమాలు చూసే క్యాన్సర్ లక్షణం అంటే కేవలం రక్తం కక్కుకోవడమే అనుకునే జనాలు ఉన్నారు.కాని క్యాన్సర్ లక్షణం అదొక్కటే కాదు.

రక్తం కక్కుకోవడం క్యాన్సర్ ప్రధాన లక్షణాల్లో ఒకటి మాత్రమే.ఎక్కువ ప్రచారం దొరకని లక్షణాలు ఇంకా ఉన్నాయి.

వాటి మీద కూడా మనకి జ్ఞానం అవసరం.అందుకే కొన్ని లక్షణాలు ఇక్కడ చూడండి.

* మీ ఒంటి మీద కొన్ని దెబ్బలు ఉన్నాయి.అవి సామాన్యంగానైతే కొన్నిరోజులకి మానిపోవాలి.

కాని అలా జరగట్లేదు.అవి అలానే ఉంటున్నాయి అంటే కొద్దిగా జాగ్రత్తపడండి.

* శరీరంలో పెద్ద పెద్ద పెద్ద పుండ్లు అవొచ్చు.అది ఒకటైనా కావొచ్చు.

అది మొటిమ కానే కాదు.మొటిమ కంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి.

చెప్పాలంటే ఎదో అనారోగ్యకరమైన పుండులాగా చూడగానే అర్థమైపోతాయి.

* మలమూత్ర విసర్జనలో మార్పులు వస్తాయి.

పెద్దగా కారణాలు లేకుండానే మలబద్ధకం, మోషన్స్ రావొచ్చు.మలవిసర్జనలో రక్తం రావొచ్చు.

మలద్వారం దగ్గర నొప్పి, కడుపులో నొప్పి ఇతర లక్షణాలు.

* ఒక్కసారిగా బరువు తగ్గిపోతారు.

దాని వెనుక పెద్ద కారణం ఏమి ఉండదు.డైట్ బానే మెయింటేన్ చేస్తున్నా, సరిగా తింటున్నా బరువు తగ్గిపోతే అది ప్రమాదమే.

* శరీరంలో ఎక్కడైనా మచ్చలు ఏర్పడవచ్చు.అవి పుట్టుమచ్చల లాంటివి కాదు.

పెద్దగా ఏర్పడతాయి.కొందరిలో ఆకారం మార్చుకుంటాయి.

సైజు కూడా మారొచ్చు.

* ఇతర లక్షణాలు :

– స్త్రీలలో వక్షోజాల చర్మంలో మార్పులు.నిపుల్ సైజులో మార్పులు.
– రాత్రుల్లో చెమటలు
– ఆకలి వేయకపోవడం
– యోని లోంచి రక్తం
– విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పి
– పని చేయకుండానే అలసట

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube