నితిన్‌ గడ్కరీ 'మూత్ర' సూత్రం

భాజపా నాయకులకు, ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ర్ట మంత్రులకు పనిచేయడం కంటే ఏవో పిచ్చి వ్యాఖ్యానాలు చేయడం మీద, అనుచితంగా మాట్లాడటం మీదనే ఎక్కువ మక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది.తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మొక్కలు బాగా పెరిగేందుకు ఓ బ్రహ్మాండమైన సూత్రం చెప్పారు.

 Nitin Gadkari’s ‘urine Treatment’ For Plants-TeluguStop.com

ఇది వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా మంచి ఉపయోగకరమైన ‘టిప్‌’ అని కూడా అన్నారు.గడ్కరీ కేంద్ర మంత్రి కాబట్టి ఇంటి ఆవరణలో సహజంగానే పెద్ద లాన్‌, అనేక మొక్కలు, చెట్లు ఉంటాయి కదా.మొక్కలు మంచిగా, పచ్చగా ఎదగాలంటే నీరు పోస్తారనే సంగతి మనకు తెలుసు.అయితే గడ్కరీకి మొక్కల జీవితాన్నే మార్చే ‘ఐడియా’ వచ్చింది.

ఆయన తన మూత్రాన్ని (యూరిన్‌) నీళ్లలో కలిపి మొక్కలకు, అక్కడి చెట్లకు పోయించాడు.ఈ ప్రయోగం మంచి ఫలితం ఇచ్చిందట.

గతంలో కంటే మొక్కలు బాగా ఎదిగి నిగనిగలాడాయట.మొదటి ఓ చిన్న ప్లాస్టిక్‌ క్యాన్‌లో తన మూత్రాన్ని పట్టాడట.

అలా పట్టి పట్టి దాన్ని యాభై లీటర్ల క్యాన్‌కు నింపాడు.తోటమాలిని పిలిచి ఈ మూత్రాన్ని నీళ్లలో కలిపి మొక్కలకు, చెట్లకు, అక్కడ ఉన్న కొద్దిపాటి పంటకు (క్రాప్‌) కూడా పోయమన్నాడట.

ఈ విధంగా ‘మూత్ర’ సూత్రం అమలు చేశాక బాగా తేడా కనబడింది.సాధారణ నీరు పోసిన మొక్కల కంటే ఈ మూత్రపు నీరు పోసిన మొక్కలు ఒకటిన్నర రెట్లు పెద్దగా పెరిగాయని గడ్కరీ చాలా సంతోషంగా చెప్పాడు.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ నెట్‌వర్‌్కలో అప్‌లోడ్‌ చేశాడు.ఇంతకూ గడ్కరీ ఉంటున్న ఇల్లు ఏమిటనుకుంటున్నారు? మోతీలాల్‌ నెహ్రూ మార్‌్గలో ఉన్న ఈ రెండో నెంబరు ఇంటిలో యూపీఏ హయాంలో నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సల్‌ (జాతీయ సలహా మండలి) ఉండేది.అప్పట్లో దానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండేవారు.అయ్యా…ఇదీ సంగతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube