మూడోస్సారి....!

ఒకటోసారి….రెండోస్సారీ….మూడోస్సారీ…అనే వేలం పాట మాదిరిగా తయారైంది వివాదాస్పద భూసేకరణ బిల్లు పరిస్థతి.రెండువేల పదమూడో సంవత్సరంలో యూపీఏ హయాంలో రూపొందించిన భూసేకరణ బిల్లుకు సవరణలు చేయాలని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటిసారి గత ఏడాది డిసెంబరులో బిల్లుకు సవరణ చేస్తూ ఆర్డినెన్సు విడుదల చేసింది.

 Union Cabinet Recommends Re-issuance Of Land Ordinance-TeluguStop.com

ఈ ఆర్డినెన్సును పార్లమెంటు ఆమోదిస్తేనే చట్టం అవుతుంది.అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఆమోదించాలి.అయితే ఆ ఆర్డినెన్సు లోక్‌సభ ఆమోదం పొందినా రాజ్యసభలోకి పోలేదు.ఎందుకంటే అక్కడ భాజపాకు, దాని మిత్ర పక్షాలకు బలం లేదు.

దీంతో ఈ ఏడాది మార్చిలో సర్కారు మరోసారి ఆర్డినెన్సు జారీ చేసింది.అయినా రాజ్యసభలో ఆమోదం పొందలేదు.

ఆర్డినెన్సు గడువు వచ్చే నెల నాలుగో తేదీతో ముగిసిపోతోంది.అది లైవ్‌లో ఉండాలంటే మళ్లీ ఆర్డినెన్సు విడుదల చేయాలి.

దీంతో మూడోసారి ఆర్డినెన్సు విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.రైతులకు తీవ్ర నష్ట కలిగించే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కార్పొరేట్లకు మేలు చేసే ఈ బిల్లును ఎట్టి పరిస్థితిలోనూ ఆమోదింపచేసుకోవాలని సర్కారు పట్టుదలగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube