Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సిగరేట్, మద్యం మాత్రమే కాదు .. ఈ అలవాట్లు కూడా కిడ్నిలకు ప్రమాదం-Unexpected Habits That Damage Your Kidneys

* ఇంట్లో వండిన కూర ఒకటే. కాని ఇంట్లో ఒకరికి మాత్రమే అందులో ఉప్పు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే? కొందరికి ఈ అలవాటు ఉంటుంది. ఉప్పు బాగా తింటారు. దీంతో శరీరంలోకి సోడియం బాగా చేరుతుంది. సోడియం ఒంట్లోకి ఎక్కువగా వెళ్ళింది అంటే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే. అందుకే ఉప్పు లిమిట్ గా తీసుకోవాలి. కూరలో తక్కువ వేసుకున్నంత మాత్రానా సరిపోదు, ఉప్పు ఉన్న పిండివంటకాలు ఎక్కువ తినకూడదు.

* డాక్టర్ ఒక మందు రాస్తే, దాన్ని ఎప్పటిదాకా, ఎలా వాడమన్నాడో, అలానే వాడాలి. టాబ్లేట్స్ ఇష్టంవచ్చినట్లు వాడటం మీ కిడ్నీలకు మంచిది కాదు. ఇబుప్రొఫెన్, ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్, ఇంకా కొన్నిరకాల యాంటిబయోటిక్స్ అతిగా తీసుకుంటే మీ కిడ్నీలను మీరే నాశనం చేసుకుంటున్నట్లు.

* డయాబెటిస్ వచ్చేంతగా స్వీట్స్ తినడం, వ్యాయామం తప్పడం లేక చేసే అలవాటు లేకపోవడం, బ్లడ్ ప్రెషర్ ని కంట్లోల్ లో ఉంచుకోకపోవడం, చివరకి టమోటాలు, ఆరెంజ్, ఆలు గడ్డ, మాంసం కూడా టూ మచ్ గా తినటం కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించినంతవరకు మంచి అలవాట్లు కావు.

Continue Reading

Trending…

To Top