ఆయనొక అగ్రనటుడు.ఆయనతో నటించడానికి హీరోయిన్లంతా క్యూ కట్టేస్తారు.
ఎక్కడి ఇండస్ట్రీ నుంచి తెలుగుకి వచ్చినా, దాదాపు ప్రతి హీరోయిన్ ఆయన నామమే జపం చేస్తుంది.మరి అలాంటి స్టార్ తో నటించే అవకాశం ఒక యువ హీరోయిన్ కి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మెలగాలి ఆ నటీమణి! తెలిసోతెలియకో చిన్న తప్పు కూడా చేయకూడదు.
కాని ఈ కథానాయిక మాత్రం మన స్టార్ కి కోపం తెప్పించింది.
విషయంలోకి వెళ్తే, కొన్నిరోజుల క్రితం వాళ్లిద్దరు నటిస్తున్న సినిమాలోని ఒక పెళ్ళి సన్నివేశాన్ని చిత్రీకరించారు.
పెళ్ళి సన్నివేశం కాబట్టి కాస్ట్యూమ్స్ , మేకప్ పని ఎక్కువే ఉంటుంది.అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా షాట్ సమయానికి రెడీ అవ్వాల్సిన హీరోయిన్, ఆ స్టార్ హీరోని గంటలకొద్దీ వెయిట్ చేయించింది.
ఆవిడ మేకప్ హంగులు ఎంతకీ పూర్తవకపోవడంతో హీరో షాట్ కూడా ఆలస్యం అవడం, ఆయన కోపంతో ఆరోజు షూటింగ్ లో పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగిందట.
ఆడియో ఫంక్షన్లో, ప్రెస్ మీట్లలో బయటకి ఎంతలా పొగడబోతున్నా, ఆ హీరోయిన్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే పడిపోయింది ఆ హీరోకి.
అందుకే అందం ఉంటే మాత్రం సరిపోదు, సినిమా ఇండస్ట్రీలో ఎంత అలెర్ట్ గా ఉండాలో కూడా తెలుసుకోవాలి.