అన్నిటికంటే అన్నదానం మిన్న అనేది చాలా పాతమాట.అన్నం దానం యొక్క గొప్పతనాన్ని తక్కువ చేయడం కాదు కాని, ఇప్పుడున్న పరిస్థితులలో రక్తదానానికి మించిన దానం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు.
అయితే ఈ రక్తదానం మీద కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి.వాటి వలన ఎంతోమంది ఔత్సాహికులు రక్తందానం చేయడానికి సంశయిస్తుంటారు.
* రక్తదానం వలన ఏయిడ్స్ సోకుతుంది అంటారు.ఇక్కడ రక్తం దానం చేయడం వలన కాదు, నీడిల్ కొత్తది వాడకపోవడం వలన సోకవచ్చు.
ఇప్పుడంతా జాగ్రత్తగా ఫ్రెష్ నీడిల్స్ వాడుతున్నారు.
* స్త్రీలు రక్తం దానం చేయకూడదు అని వాదించేవారు లేకపోలేదు.
పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోతారు స్త్రీలు.కాని అనేమియా సమస్య లేనంతవరకు, ఆరోగ్యకరమైన ఏ స్త్రీ అయినా, తన రక్తాన్ని దానం చేయవచ్చు.
* 40 ఏళ్ళు దాటాక రక్తం దానం చేయకూడదు అని నమ్ముతారు కొందరు.అరవై ఏళ్ళ వరకు ఆరోగ్యకరంగా ఉన్న ఏ మనిషి అయినా రక్తాన్ని దానం చేయొచ్చు.
* రక్తందానం వలన భరించలేని నొప్పి కలుగుతుందేమో అని భయపడతారు మరికొందరు.నొప్పి గురించి అంత భయకరంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు.
ఒకటి రెండు రోజులు కాస్త వీక్ గా ఉండవచ్చు అంతే.
* రక్తందానం వలన ఒంట్లో రక్తం తగ్గిపోతుందనే అపోహ మరొకటి.48 గంటల తరువాత మీ బ్లడ్ వెజెల్స్ అన్ని మామూలు అయిపోతాయి.ఇంకా చెప్పాలంటే రక్త దానం చేయడం మీ ఒంటికే మంచిది.
* ఏడాదికి ఒక్కసారే రక్తాన్ని దానం చేయలనే వాదన ఇంకొందరిది.కాని మూడు నుంచి ఆరు నెలల విరామంలో రక్తాన్ని దానం చేయవచ్చు.