తెలుగు సినిమా మార్కేట్లో ఎంత మార్పు.బాహుబలి రాకముందు మనకు తెలిసిన తెలుగు సినిమా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం.మరి ఇప్పుడో, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించేస్తోంది.2017 జనవరిలో విజయ్ నటిస్తున్న “బైరవా” తో తమిళనాట సినిమా సందడి మొదలవుతుంది.ఫిబ్రవరిలో కార్తి – మణిరత్నం సినిమా.మార్చిలో మహేష్ బాబు – మురుగదాస్ సినిమా.ఏప్రిల్ లో బాహుబలి – ది కంక్లూజన్.మేలో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా.
ఇలా తమిళ కాలెండర్ ని ప్రకటించారు తమిళ సిని క్రిటిక్స్.
ఇక్కడ తెలుగువారు గర్వించదగిన విషయం ఏమిటంటే, తమిళనాట వచ్చే ఏడాది విడుదలవబోతున్న తొలి 5 పెద్ద సినిమాల్లో రెండు తెలుగువారివే కావడం.
బాహుబలి ఇప్పటికే తమిళనాట పాతుకుపోగా, మహేష్ బాబు 23వ సినిమా కూడా మంచి సౌండ్ చేస్తోంది.ఇదే నేలలో వస్తున్న ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ నచ్చితే తమిళ తంబీల అంచనాలు మరింత పెరిగిపోతాయి.
ఎంత మార్పు చూడండి.ఇటు మార్చిలో మహేష్ సినిమాతో, అటు ఏప్రిల్ లో బాహుబలితో పోటిపడటానికి తమిళ నిర్మాతలు సాహసించట్లేదు.
ఈ చిత్రాలు సక్సెస్ అయితే, మెల్లిగా మెలిమెల్లిగా, మన మిగితా తెలుగు టాప్ హీరోలు కూడా తమిళ మార్కేట్ మీద దండయాత్ర చేయవచ్చు.