సెలెబ్రిటీ లు అయ్యి ఉండి రోడ్డుల మీద మందు తాగి కార్లు నడుపుతూ దొరికేవారు ఎక్కువ అవుతున్నారు.సేఫ్టీ సంగతి పక్కన పెట్టినా పోలీసులకి దొరికితే మీడియా లో ఏకేస్తారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎన్నో వందల మంది సినిమా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద అడ్డంగా దొరికేస్తున్నారు.
సినిమా వారు అంటేనే సహజంగా ప్రతీ చిన్న చర్య నీ మీడియా గమనిస్తూ ఉంటుంది.వారు ఎప్పుడు తప్పు చేస్తారా వారి గురించి టీవీ లో వేసుకుంటూ వెళదాం అనే ఉద్దేశ్యం తో ఉంటుంది మీడియా.
ఇలాంటి టైం లో మంచి కంటే చెడు ఎక్కువ ఫోకస్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ప్రముఖ బుల్లి తెర హీరో , ప్రముఖ సీరియల్స్ నటుడు భరణి శంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో జూబ్లీ హిల్స్ లో దొరికాడు.
అర్ధరాత్రి కారు నడుపుతూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకి వచ్చిన ఆయన్ని పోలీసులు బ్రీథ్ అనలైజర్ తీసుకోమని కోరగా 41 శాతం మద్యం సేవించి ఉన్నట్టు యంత్రం చూపించింది.వెంటనే ఆయన మీద కేసు పెట్టి కారు ని సీజ్ కూడా చేసారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి కూడా.ఇలా దొరికిపోవటాన్ని ఏమనాలి?
.