హైదరాబాద్‌లో పోలీసులు గత కొంత కాలంగా వ్యభిచారం కేసుల్లో బుల్లి తెర మరియు వెండి తెర నటిమనులను పట్టుకోవడం పరిపాటి అయ్యింది.ఇప్పటికే ఎంతో మంది నటిలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తాజాగా మరోసారి పోలీసులకు బుల్లి తెర నటి చిక్కింది.తెలుగు సీరియల్స్‌లో నటించే ఈ నటిని హైదరాబాద్ శివారు ప్రాంతం అయిన వనస్థలి పురంలోని ఒక బ్రోతల్ హౌస్‌లో పట్టుకున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
పక్కా సమాచారంతో వనస్థలిపురంలోని ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులకు నలుగురు మహిళలతో పాటు ముగ్గురు విటులు కూడా చిక్కారు.వారందరిని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.
అరెస్టు అయిన నలుగురు మహిళలలో నటి కృష్ణవేణి ఉన్నట్లుగా పోలీసులు దృవీకరించారు.ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత వారిని కోర్టు ముందుకు తీసుకెళ్తామని పోలీసులు తెలియజేశారు.