'తులసి' వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

హిందూ సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇందులో రెండు జాతులున్నాయి.

 Tulasi Leaves Uses And Health Benefits In Telugu-TeluguStop.com

ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అని అంటారు.వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు.

ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని ఎక్కువగా వాడతారు.తులసిని పూజలలో ఉపయోగిస్తారు.

అలాగే తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.తులసిలో యాంటి ట్యూబర్‌క్యులర్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌, యాంటి వైరల్‌ గుణాలున్నాయి.1.తులసి రసం,అల్లం రసం,తేనే కలిపి తీసుకుంటే మలబద్దక సమస్య నుండి బయట పడవచ్చు.
2.తులసి ఆకుల కషాయాన్ని ప్రతి రోజు త్రాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
3.తులసి రసంలో నిమ్మరసం కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
4.తులసి రసంలో శొంఠి కలిపి తీసుకుంటే కడుపునొప్పి సమస్య తగ్గుతుంది.
5.తులసిలో జ్ఞాపకశక్తి, చురుకుదనంను పెంచే లక్షణాలు ఉన్నాయి.అందువల్ల చదువుకొనే పిల్లలకు రోజు రెండు తులసి ఆకులు తినిపిస్తే మంచిది.
6.మెటబాలిక్‌ వ్యవస్థను పటిష్ట పరచి, రక్తంలో చెడు రసాయనాలను బయటకు పంపటం ద్వారా కాలేయ సంబంధిత వ్యాధులకు చికిత్సగా తులసి పనిచేస్తుంది.
7.తులసి ఆకులు, మిరియాలు దంచి బాగా మరిగించి కషాయం తయారు చేసి రెండు చెంచాలు చొప్పున త్రాగితే జలుబు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్న తులసి వాడి ఆరోగ్య సమస్యల నుండి బయట పడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube