2019లో టీఆర్ఎస్‌ గెలిచే సీట్ల లెక్క ఇదే

ఈ హెడ్డింగ్ చూస్తే మ‌నకు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయం.తెలంగాణ‌లో బ్రేకుల్లేకుండా దూసుకుపోతోన్న అధికార టీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గెలిచి.

 Trs Will Get 5 Seats In 2019 Elections-TeluguStop.com

మ‌ళ్లీ కేసీఆర్ సీఎం అవుతార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు సైతం అంచ‌నా వేస్తున్నాయి.మ‌రి ఈ టైంలో టీఆర్ఎస్‌కు 5 సీట్లు ఏంట‌ని షాక్ అవుతున్నారా.? మ‌రి టీఆర్ఎస్ 5 సీట్ల లెక్క ఏంటో చూద్దాం.

సంచ‌ల‌న వ్యాఖ్య‌లతో అంద‌రిని త‌న వైపున‌కు తిప్పుకునే స‌త్తా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ ఉపనేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవ‌లే 2019లో తానే కాంగ్రెస్ త‌ర‌పున సీఎం అభ్య‌ర్థిని అంటూ ప్ర‌క‌టించుకున్నారు.

ఆ వ్యాఖ్య‌లు మ‌ర్చిపోకుండానే ఆయ‌న మరోసారి త‌న‌దైన స్టైల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మీడియా మిత్రుల‌తో స‌ర‌దాగా మాట్లాడిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అప్పుడే జోస్యం చెప్పేశారు.

2019 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కేవ‌లం 5 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని అన్నారు.ఈ ఎన్నిక‌ల్లో మంత్రులు హ‌రీష్‌రావు, ఈటెల రాజేంద‌ర్‌తో పాటు మ‌రో ముగ్గురు త‌ప్ప మిగిలిన వార ఎవ్వ‌రూ గెల‌వ‌ర‌ని ఆయ‌న తెలిపారు.

టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ గెలుపు కూడా క‌ష్ట‌మేన‌ని ఆయ‌న మ‌రో షాక్ ఇచ్చారు.త‌న నాలుక‌ మీద మ‌చ్చ ఉంద‌ని…తాను చెప్పింద‌ల్లా జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

మంత్రి హ‌రీష్‌రావు పోరాట యోధుడ‌ని ప్ర‌శంస‌లు కురిపించిన కోమటిరెడ్డి మ‌రో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్ అని అన్నారు.గ‌తంలో తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్పుడు, త‌న స‌హ‌చ‌రులు కూడా రాజీనామా చేస్తే అప్పుడే తెలంగాణ వ‌చ్చేద‌ని కూడా ఆయ‌న చెప్పారు.

తెలంగాణ ఇవ్వ‌డంలో కాంగ్రెస్ తాత్సారం చేసినందువ‌ల్లే తాము న‌ష్ట‌పోయామ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆ టైంలో జానారెడ్డి రాజీనామాల‌తో తెలంగాణ వ‌స్తుందా అని ప్ర‌శ్నించార‌ని ఆయ‌న వాపోయారు.

ఇక తాను త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో కాంగ్రెస్ అభివృద్ధి కోసం రాష్ట్ర‌మంత‌లా మోటార్ సైకిల్ యాత్ర చేస్తున్న‌ట్టు కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.మ‌రి 2019లో కోమ‌టిరెడ్డి జోస్యం నిజ‌మ‌వుతుందా…? రివ‌ర్స్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube