మంత్రి ప‌ద‌వి కోసం టీఆర్ఎస్ సీనియ‌ర్ మౌన‌వ్ర‌తం

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కాక‌లు తీరిన సీనియ‌ర్ గ‌త రెండు ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న అన్ని ఎన్నిక‌ల్లోను విజ‌యం సాధిస్తూ వ‌స్తోన్న ఎర్ర‌బెల్లి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గెలిచి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు కారెక్కేశారు.టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లి కారెక్క‌డం వెన‌క చాలా తంతే జ‌రిగిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

 Trs Senior Leader Mouna Vratham-TeluguStop.com

ఒక్క‌సారైనా మంత్రి కావాల‌నేది ఎర్ర‌బెల్లి జీవిత ల‌క్ష్యం.ఆ ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోవ‌డంతో ఆయ‌న కేవ‌లం మంత్రి ప‌ద‌వి కోస‌మే టీఆర్ఎస్‌లో చేరిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.ఎన్నో ఆశ‌ల‌తో మంత్రి ప‌ద‌వి కోసం టీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర‌బెల్లిని ఇప్పుడు ఆ పార్టీలో ప‌ట్టించుకునే వారే లేర‌ట‌.

ఆయ‌న‌కు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కావాల‌న్నా ప‌ట్టించుకునే నాథుడే లేడ‌ట‌.గ‌తంలో ఆయ‌నకు అవిభాజ్య వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో సైతం ఎంతో ప్ర‌యారిటీ ఉండేది.

రాను రాను ఆయ‌న‌కు అస్స‌లు ఇప్పుడే ప్రాధాన్య‌మే ఉండ‌డం లేద‌ట‌.

టీఆర్ఎస్‌లో చేరిన కొత్తలో మాట‌మాటికి సీఎం కేసీఆర్ ప‌క్క‌న ఎక్కువుగా క‌నిపించే ఎర్ర‌బెల్లి ఇప్పుడు తెర‌మీద అస్స‌లు క‌న‌ప‌డ‌డం లేదు.

క‌నీసం వారానికో సారి అయినా ప్రెస్‌మీట్ పెట్టి హంగామా చేసే ఆయ‌న ఇప్పుడు వార్త‌ల్లో క‌న‌ప‌డ‌డం లేదు.అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే మంత్రి ప‌ద‌వి కోసం ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు పెద్ద‌గా స్పంద‌న రావ‌డం లేదట‌.

ఎర్ర‌బెల్లి మంత్రి ప‌ద‌వికి సామాజిక నేప‌థ్య‌మే అడ్డంకిగా ఉంది.కేసీఆర్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎర్ర‌బెల్లికి మంత్రి ప‌ద‌వి రావాడం క‌ష్ట‌మ‌న్న టాక్ వ‌స్తోంది.

ఆ సామాజిక‌వ‌ర్గం నుంచి సీఎం కేసీఆర్‌తో పాటు హ‌రీష్‌-కేటీఆర్‌-జూప‌ల్లి కృష్ణారావు ఉన్నారు.వీరిలో జూప‌ల్లిని త‌ప్పిస్తేనే ఎర్ర‌బెల్లికి ఛాన్స్ రావొచ్చు.

అయితే కేసీఆర్ జూప‌ల్లిని త‌ప్పించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌.దీంతో ఎర్ర‌బెల్లి ఇప్పుడు మౌన‌వ్ర‌తం పాటిస్తున్నాడ‌న్న టాక్ తెలంగాణ రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.

ఇక స్టేట్ రాజ‌కీయాల సంగ‌తి ప‌క్క‌న పెడితే…ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న పాల‌కుర్తి నియోజ‌క వ‌ర్గంలో నామినేటెడ్ ప‌ద‌వుల విష‌య‌మై కూడా ఎర్ర‌బెల్లి మాటకి ప్రాధాన్య‌త దక్కడం లేద‌ట‌.ఆయ‌న సూచించిన పేర్ల‌ను అధికార పార్టీ ప‌క్క‌న పెట్టేయ‌డంతో ఆయ‌న గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రి ఎర్ర‌బెల్లి అసంతృప్తిని కేసీఆర్ ఎలా చ‌ల్లారుస్తారో.? ఆయ‌న మౌన‌వ్ర‌తం ఎప్ప‌ట‌కి వీడ‌తారో కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube