Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

టీఆర్ఎస్‌లో వీళ్ల అడ్ర‌స్ ఎక్క‌డ‌..!-TRS Party Lo Villa Address Ekkada..?

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు ఇప్పుడు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహాలు టీ పాలిటిక్స్ ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో వినిపిస్తున్నాయి. ఉద్య‌మ స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నేత‌ల‌పై ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోసిన నేత‌లు అధికారంలోకి వ‌చ్చాక కొద్ది రోజుల పాటు బాగానే త‌మ వాయిస్ వినిపించారు. అలాంటి నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోవ‌డంతో అస‌లు ఏమైందా ? అని అంద‌రూ ఆరాలు తీయ‌డం స్టార్ట్ చేసేశారు.

గతంలో కేసీఆర్‌ను కాని, టీఆర్ఎస్‌ను కాని చిన్న మాట అంటేనే అంతెత్తున విరుచుకుప‌డే నేత‌లు ఇప్పుడు టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను ఎన్ని మాట‌లంటున్నా అస్స‌లు నోరు మొద‌ప‌డం లేదు. ఇందుకు ప్ర‌ధాన కారణం అసంతృప్తేనని తెలుస్తోంది. కేవలం సీనియర్ నేతలే కాదు మంత్రులదీ అదే దారి. కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబం మొత్తాన్ని క‌ట్ట‌క‌లిపి ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేసినా ఏ ఒక్క మంత్రి మాట్లాడ‌డం లేదు. వీరంతా త‌మ శాఖ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

Continue Reading
More Posts
To Top