అరచేతిలో వైకుంఠం నిజం అవ్వనుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నాడు.హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చుతానంటూ ఎన్నికల ముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పుకొచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు ఆ పని మొదలు పెట్టాడు.

 Trs Govt Releases Ravindra Bharathi New Design-TeluguStop.com

ఇప్పటికే పెద్ద పెద్ద భవనాలు, ఆకాశ మార్గాన రోడ్డు, ఫ్లై ఓవర్‌లు ఇంకా ఎన్నో హైదరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నాడు.తాజాగా రవీంద్ర భారతి మరియు తెలంగాణ కళా భవన్‌ల ఊహా చిత్రాలను విడుదల చేయడం జరిగింది.

నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఆ కట్టుడాలున్నాయి.

ముఖ్యమంత్రి చెప్పిన ప్రతీ అక్షరం కూడా ఆచరణలోకి వస్తే తప్పకుండా హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో ఒకటిగా నిలవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరో మూడు నాలుగు సంవత్సరాల్లోనే తాను అనుకున్నట్లుగా హైదరాబాద్‌ను మార్చుతానంటూ కేసీఆర్‌ నమ్మకంతో ఉన్నాడు.తనతో పాటు మంత్రులు, అధికారులు కూడా కష్టపడి పని చేయాలని పిలుపునిస్తున్నాడు.

ఇక హుస్సేన్‌ సాగర్‌ను మునుపటిలా మంచి నీటి సరస్సుగా మార్చాలని కేసీఆర్‌ కలలు కంటున్నాడు.అది ఈ సంవత్సరంలోనే సాధ్యం అని కూడా ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

మొత్తానికి కేసీఆర్‌ అరచేతిలో వైకుంఠం చూపించి, దాన్ని నిజం చేసేందుకు కృషి చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube