బీఫ్ ఫెస్టివల్ వెనుక రెండు పార్టీలు ?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ వెనుక రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయట.పైకి కనబడేది విద్యార్థులు అయినా వెనుక ఉండి నడిపించేది రాజకీయ పార్టీలు అని ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే ఆరోపించారు.

 Trs Govt, Mim Doing Beef Festival-TeluguStop.com

ఆయనే భారతీయ జనతా పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యే రాజా సింగ్.బీఫ్ ఫెస్టివల్ అడ్డుకుంటామని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన రాజా సింగును పోలీసులు పొద్దున్నే అరెస్టు చేశారు.

తనను అరెస్టు చేసినందుకు రాజా సింగ్ మండి పడ్డారు.తనవంటి గోవు భక్తుడిని అరెస్టు చేయడం అన్యాయమని వాదించారు.

కానీ ఆయన్ని అరెస్టు చేయకుండా వదిలేస్తే గొడవలు అవుతాయని భావించిన పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు.బీఫ్ ఫెస్టివల్ వెనుక అధికార గులాబీ పార్టీ , ఎమ్మైఎమ్ పార్టీ ఉన్నాయని రాజా సింగ్ ఆరోపించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే వారు బీఫ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏర్పాటు చేయించారని అన్నారు.యూనివర్సిటీ విద్యార్థులు ఇటువంటి కూరల కార్యక్రమాలు చేయకుండా చదువు మీద దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సలహా ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube