త్రివిక్రమ్‌ మాట వినడం లేదట

సునీల్‌ హీరోగా మారిన తర్వాత రెండు మూడు తప్ప పెద్ద సక్సెస్‌లు వచ్చింది లేదు.దాంతో సునీల్‌ కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాడు.

 Trivikram’s Advice To Sunil-TeluguStop.com

సునీల్‌ సినిమా వచ్చి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను మొదలు పెట్టలేదు.కథల ఎంపికలో మరియు పాత్రల ఎంపికలో సునీల్‌ ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒక వైపు హీరో ఆఫర్లు వస్తూనే మరో వైపు సునీల్‌కు కమెడియన్‌గా ఛాన్స్‌ వస్తున్నాయి.అయితే హీరోగా చేస్తున్న ఈ సమయంలో కామెడీ వేశాలు వేయను అంటూ వచ్చిన ఆఫర్లను కాదంటున్నాడు.

సునీల్‌కు ఆయన స్నేహితుడు అయిన త్రివిక్రమ్‌ తాజాగా వచ్చిన కామెడీ వేశాలను కాదనకు అంటూ సలహా ఇచ్చాడట.కాని సునీల్‌ ఆ మాటను వినడం లేదని తెలుస్తోంది.

స్టార్‌ హీరోల సినిమాలో కామెడీ వేశాలు వేస్తూనే, హీరోగా సినిమాల్లో నటించమని త్రివిక్రమ్‌ చెప్పినా సునీల్‌ ఆ మాటలు పెడ చెవిన పెట్టి, హీరో వేశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.హీరోగా వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తోన్న సునీల్‌ ఇకపై అయినా సక్సెస్‌లను అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube