నందమూరి వారసుణ్ణి త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడా?

నందమూరి బాలకృష్ణ చాలా రోజుల నుంచి కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం దర్శకుణ్ణి వెతుకుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై సీరియస్ గా తన అనుచరులతో చర్చలు జరుపుతున్నాడు.

 Trivikram To Direct Mokshagna-TeluguStop.com

ప్రస్తుతం మోక్షజ్ఞ బాలయ్య బాబు నటిస్తున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు.ఇటువంటి పరిస్థితిలో ఒక వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది.

మోక్షజ్ఞ ను కొరటాల శివ, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో ఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందా అనే కోణంలో ఆలోచించాడట.అయితే మొదటి సినిమా మాస్ సినిమా కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడు బాలయ్య.

బాలయ్య కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే హిట్ కొట్టాడు.

ఇప్పుడు తన కొడుకు మోక్షజ్ఞ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు అందమైన ప్రేమ కథతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావించాడు.

దాంతో బాలకృష్ణ చూపు కుటుంబ కథా చిత్రాలను బాగా డీల్ చేసే మాటల మాంత్రికుడు మీద పడినట్టు సమాచారం.ఇప్పటివరకు త్రివిక్రమ్ నందమూరి హీరోలతో సినిమా చేయలేదు.

ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే న్యూ జనరేషన్ తో హిట్ కొట్టినట్టు అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube